టీజ‌ర్‌1 కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ తెచ్చుకున్న‌ రాహుల్ ర‌వీంద్ర‌న్ “హౌరాబ్రిడ్జ్” టీజ‌ర్ 2 విడుద‌ల‌

శ్రీ వడ్డేపల్లి సత్యనారాయణ ఆశీర్వచనాలతో … ఈ ఎమ్ వి ఈ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ బ్యానర్ పై రాహుల్ రవీంద్రన్, చాందినీ చౌదరీ, మనాలీ రాథోడ్ హీరో హీరోయిన్లుగా రేవన్ యాదు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం హౌరా బ్రిడ్జ్. చిత్రం టీజ‌ర్‌1 ని ఇటీవ‌ల విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్ కి అనూహ్య‌మైన రెస్పాన్స్ రావ‌టంతో యూనిట్ స‌భ్యులంతా ఆనందంగా వున్నారు. ఇదే ఊపుతో దీపావ‌ళి శుభాకాంక్ష‌ల‌తో టీజ‌ర్2ని విడుదల చేశారు. విభిన్న‌ కథలతో దూసుకెళ్తున్న రాహుల్ రవీంద్రన్ మరో ఇంట్రస్టింగ్ స్టోరీతో మనముందుకు వస్తున్నాడు. ప్ర‌స్తుతం ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ సినిమా న‌వంబ‌ర్ లో విడుదల‌కి సిధ్ధ‌మ‌వుతుంది. త్వరలోనే ఆడియో లాంచ్ చేసి… రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.

ఈ సందర్భంగా హీరో రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ… హౌరా బ్రిడ్జ్ అనే టైటిల్ నే మా చిత్రం క‌థ‌. అదేంట‌నేది మీరు చిత్రం చూసాక‌నే అర్దం అవుతుంది. ఇప్పుడు రివీల్ చేయలేం. హ్యూమన్ రిలేషన్స్ కి ఈకథ బ్రిడ్జ్ గా ఉంటుంది. ఇందులో మరో బ్రిడ్జ్ కూడా ఉంటుంది. అది ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. చాందినీ చౌదరి ఇందులో చాలా మంచి క్యారెక్టర్లో నటించింది. మనాలీ రాథోడ్ కి ఈ సినిమా చాలా మంచి పేరు తెస్తుంది. దర్శకుడు రేవన్ చాలా క్లారిటీతో ఉన్నాడు. అధ్బుతమైన విజువల్స్ మిమ్మల్ని వండర్ చేస్తాయి. ఈ చిత్రానికి మేము విడుదల చేసి టీజ‌ర్‌1కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్ప‌డు దీపావ‌ళి కానుక‌గా టీజ‌ర్‌2ని విడుదల చేస్తున్నాము. ఈ చిత్రం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. న‌వంబ‌ర్ లో చిత్రాన్ని విడుద‌ల చేయ‌టానికి నిర్మాత‌లు స‌న్నాహలు చేస్తున్నారు. నా కెరీర్లో అందరూ మెచ్చుకునే చిత్రంగా నిలుస్తందనే నమ్మకం ఉంది. అని అన్నారు.

దర్శకుడు రేవన్ మాట్లాడుతూ… బూచ‌మ్మ బూచొడు లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం త‌రువాత ఇది నా రెండో ప్రాజెక్ట్. బూచమ్మ బూచోడు నాకు చాలా మంచి పేరు తెచ్చింది. ఈ చిత్రం మెద‌టి టీజ‌ర్ ని ఇటీవ‌లే విడుద‌ల చేశాము. అయితే విడుదల చేసిన రోజు నుండి ప్ర‌తి చోటా మా టీజ‌ర్ గురించి మాట్లాడుకోవ‌టం చాలా ఆనందంగా వుంది. ప్రామీస్ చేయ్యటం అంటే రెండు చేతులతో క‌దా.. ఇలా కాదేమో.. ఇలానే బావుంది క‌దా అనే డైలాగ్ యూత్ కి విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. చాలా మంది సోష‌ల్ మీడియాలో డ‌బ్‌స్మాష్ లు చేయ‌టం మా చిత్ర క్రేజ్ ని తెలియ‌జేస్తుంది. ఇప్ప‌డు దీపావ‌ళి సంద‌ర్బంగా మా రెండ‌వ టీజ‌ర్ ని విడుద‌ల చేస్తున్నాము. ఇది అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. ఎంతో క‌ష్ట‌ప‌డి, ఇష్ట‌ప‌డి చేశాను. నాహీరో రాహుల్‌ రవీంద్రన్ చాలా మంచి పెర్ ఫార్మర్. మా హీరోయిన్స్ ఛాందిని చౌద‌రి, మ‌నాలి రాథోడ్ లు ఇద్ద‌రి పాత్ర‌లు చాలా ఇంపార్టెంట్ వున్న పాత్రలే . ఇది బ్రిడ్జ్ నేపథ్యంలో సాగే ఇంట్రస్టింగ్ స్టోరీ. అందుకే హౌరా బ్రిడ్జ్ అని పెట్టాం. సినిమా చాలా బాగా వచ్చింది. చిత్ర షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే గ్రాండ్ గా ఆడియో లాంచ్ చేస్తాం. రిలీజ్ డేట్ ను కూడా త్వరలోనే ప్రకటించబోతున్నాం. ఈ సినిమా అందరికీ మంచి పేరు తెచ్చేదిగా ఉంటుంది. ప్రతీ క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉంటుంది. అని అన్నారు.

నటీనటులు
రాహుల్ రవీంద్రన్
చాందినీ చౌదరి
మనాలీ రాథోడ్
రావ్ రమేష్
అజయ్
ఆలీ
పోసాని కృష్ణ మురళి
ప్రభాస్ శ్రీను,
విద్యుల్లేఖ
జబర్దస్త్ రాకింగ్ రాకేష్ తదితరులు

టెక్నీషియన్స్
శ్రీ వడ్డేపల్లి సత్యనారాయణ ఆశీర్వచనాలతో
మ్యూజిక్ డైరెక్టర్ – శేఖర్ చంద్ర
సినిమాటోగ్రాఫర్ – విజయ్ మిశ్రా
ఎడిటర్ – కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాత – ఈ ఎమ్ వి ఈ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్
స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం – రేవన్ యాదు