దేశ భాషలందు తెలుగు లెస్స అనే సామెత సచిన్ కి బాగా నబ్బినట్టు ఉంది. బెంగళూరులో ఆయన రోజువారీ వార్తాపత్రిక ’తో మాట్లాడుతూ తెలుగు భాషంటే తనకు ఎంతో ఇష్టమని, మాట్లాడడం కాస్త కష్టంగా ఉన్నా ఇష్టంగా నేర్చుకుంటున్నానని సచిన్ టెండూల్కర్ అన్నారు. . దత్తత గ్రామాల ప్రజలతో మమేకమయ్యేందుకు తెలుగు భాషా పరిజ్ఞానం కొంతమేరకైనా అవసరమని భావిస్తున్నట్లు చెప్పారు. తెలుగు ప్రజలు ఎంతో సౌమ్యులని సచిన్ కొనియాడారు.