దండుపాళ్యం.. నాలుగేళ్ల కింద వచ్చిన ఈ సినిమా ఓ సంచలనం. శ్రీనివాస్ రాజు తెరకెక్కించిన దండుపాళ్యం ఓ ముఠా కథ. హత్యలు చేస్తూ.. అత్యాచారాలు చేస్తూ సాగిపోయే ఓ గ్యాంగ్ కథ ఇది. కర్ణాటకలో ఈ చిత్రం సృష్టించిన సంచలనం మాటల్లో చెప్పలేం. తెలుగులో కూడా దండుపాళ్యం పర్లేదనిపించింది. ఈ సినిమాకు ఇదివరకే ఓ సీక్వెల్ వచ్చింది. దండుపాళ్యం 2 కూడా బాగానే విజయం సాధించింది. ఇక ఇప్పుడు పార్ట్ 3 కూడా సిద్ధం చేసాడు దర్శక నిర్మాతలు. శ్రీనివాస్ రాజే ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. తాజాగా విడుదలైంది దండుపాళ్యం 3 ట్రైలర్. ఈ ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు మామూలుగా పెరగవు. తొలి రెండు భాగాలతో పోలిస్తే మూడో పార్ట్ లో స్టార్ క్యాస్ట్ కూడా పెంచేసాడు శ్రీనివాస్ రాజు. సంజన మరోసారి ఇందులో కీలకపాత్రలో నటించింది. ఈమె పూర్తిగా డీ గ్లామరైజ్డ్ పాత్రలో నటించింది. రవిశంకర్ పోలీస్ పాత్రలో కొనసాగాడు. మొత్తానికి ఈ చిత్ర ట్రైలర్ ఇప్పుడు కర్ణాటకతో పాటు తెలుగు ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.