దర్శకుల అజ్ఞానం వల్లే హీరోలు అజ్ఞాతవాసంలోకి


కొత్త కథలతో చిత్రాలు రావట్లేదని ఇండస్ట్రీ వారి దగ్గర నుండి ప్రేక్షకుల వరకు అందరూ తెలుగు చిత్రాల పై విమర్శలు గుప్పించే వారే. తమిళ చిత్రాలు వలె నావెల్టీ ఉన్న కథలు రియలిస్టిక్ ట్రీట్ మెంట్ మన తెలుగు చిత్రాల్లో ఎందుకు రావని ప్రతివాడు ప్రశ్నించేవాడే. అయితే దీనికి కారణం హీరోల ఇగో అని, వారు కొత్త కథలు తెచ్చే దర్శకులను ఎంకరేజ్ చేయకపోగా వారి అభిమానులు ఒప్పుకోరని, వారి ఇమేజ్ కు తగ్గట్లు మాస్ మసాలా కూడిన కథలనే చెయ్యడానికి ఇష్టపడటం వల్లే ఈ దౌర్భాగ్యపు స్థితి ఉందని విస్తృతంగా ప్రచారంలో ఉన్న విషయం. కానీ ఈ వాదనకు బిన్నంగా తాజాగా ఓ మెసెజ్ వాట్సాప్ లో వైరల్ అవుతుంది. చదువుతే లోపం హీరోలలో ఉందొ దర్శకులలో ఉందొ లేదా మరేదైనా కారణమో మీకే తెలుస్తుంది.
దయచేసి ఎవ్వరి మనోభావాలు దెబ్బతీసుకోవద్దు
ఇది సినిమా గురించి రాస్తున్న రివ్యూనో.. ఇస్తున్న రేటింగో కాదు..!!
ఆ పెద్ద సినిమా చూడడం జరిగింది.. ఇది మామూలు సినిమా కాదు.. ఎందుకంటే..
కాపీకోరు కధలు , లత్తుకోరు కధనాలు కాకుండా.. ఒక సినిమా చివర్లో మన పేరుతో “ a film by “ అనే title card చూసుకోవాలన్న కలని నిజం చేసుకోవడానికి “SCRIPT” అనే ఆయుధం ద్వారా ఓ కొత్త కధ చెప్పాలనో.. లేక జనాలకి తెలిసిన కధనే కొత్తగా చెప్పాలనో ఒళ్ళు దగ్గరపెట్టుకుని నిజాయితీగా కష్టపడుతున్న కొన్ని వందల మంది అనామకులకి తప్పనిసరిగా మేము రాసుకుంటున్న కధలు.. ప్రయత్నాలు అద్భుతాలే అన్న కొండంత ధైర్యాన్నిచ్చిన సినిమా ఇది..!!
ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే..
ఈ రైటర్ కమ్ డైరెక్టర్ గారు ఇంతకుముందు రాసిన.. “ఒక వ్యక్తికి ఉంటే కోపం… ఆదే ఒక సమూహానికి ఉంటే ఉద్యమం..” “యుద్ధం అంటే చంపడం కాదు.. గెలవడం” లాంటి కొన్ని అద్భుతాల మీద ఉన్న గౌరవంతో.. ఆయన తెలుగు భాషలోని ప్రధామాక్షరలను టైటిల గా పెట్టి తీసిన గత సినిమా చూశాక, ఇదే ఫేస్బుక్ లో ఆయన గురించి .. “అద్భుతాలు రాయగలిగినవాళ్లు అద్భుతాలే రాయాలి.. పంచులూ.. ప్రాసలూ కాదు “ అని కాస్త మర్యాదగా చెప్పడం జరిగింది.
కానీ.. ఇప్పుడు..కాస్తో కూస్తో సినిమా జ్ఞానం ఉన్నవాళ్ళు మాట్లాడే వాళ్ళ మాటలు పక్కన పెడితే.. ఎక్కడో పల్లెటూళ్లో గేదెలు కాసుకుంటూ ఓ మూడువేల రూపాయల సెల్ ఫోన్లో JIO వాడి దయవల్ల పొద్దున్నుంచి అర్ధరాత్రి వరకూ యూట్యూబ్లో వీడియోల్ని తిప్పి తిప్పి చూసే ఓ పది పదిహేనేళ్ళ కుర్రాడు సైతం సినిమాల మీద రివ్యూలు.. రేటింగులు రాసేస్తున్న ఈ టైంలో కూడా.. అగ్రదర్శకులం కదా.. మనం ఏం రాసినా.. తీసినా జనాలు చూసేస్తార్లే అన్న అతి నమ్మకమో.. లేక అద్భుతాలు రాయగలిగే ఆ పెన్నులో నిజంగా ఇన్క్ అయిపోవడంవల్లనో తెలీదుగానీ అద్భుతాలు రాయగలిగినవాడు అదేపనిగా పంచులు.. ప్రాసల కోసం పాకులాడడం… పైగా మొదటి సినిమా నుంచి ఇప్పటివరకూ
ప్రేరణ పేరుతో కాపీ కొట్టి లేపేస్తున్న ప్రతి సీన్ ని సినీ జనాలు పోస్టమోర్టమ్ చేసేస్తున్నా సరే.. అవేమీ పట్టించుకోకుండా.. ఇంకా కధల్ని ఫ్రెంచ్ సినిమాల నుంచి, డైలాగుల్నీ పాత తెలుగు నవళ్ళ నుంచి లేపేస్తూ “అగ్ర దర్శకులు” అన్న లిస్ట్ లో కంటిన్యూ అవుతూ అప్డేట్ అవ్వకపోవడం మాత్రం చాలా బాధాకరం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here