అవునా.. నిజంగానా.. వాళ్లిద్దరి మధ్య ఏం జరుగుతుంది..? అసలు ఇది నిజమేనా అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే ఇది నిజమే. ఈ మధ్య కాలంలో డిఎస్పీతో త్రివిక్రమ్ కు పెద్దగా పడట్లేదనే టాక్ వినిపిస్తుంది. దీనికి సంకేతాలు కూడా బాగానే కనిపిస్తున్నాయి. అసలు దేవీ లేకుండా సినిమా చేయడానికి ఆలోచించే మాటల మాంత్రికుడు. ఇప్పుడు ఆయన లేకుండానే అన్నీ బాగున్నాయి అంటున్నాడు. అసలు దేవీతో ఏం గొడవ జరిగిందనే విషయం పక్కనబెడితే కనీసం ఇద్దరూ ఇప్పుడు మాట్లాడుకోవట్లేదనే టాక్ కూడా వినిపిస్తుంది. ఆ మధ్య నవంబర్ 7న త్రివిక్రమ్ బర్త్ డేకు దేవీ విషెస్ చెప్పలేదు. అదే సమయంలో ఆ రోజు కమల్ కు ఆయన పుట్టినరోజు విషెస్ చెప్పాడు. కానీ నాలుగు సినిమాలకు కలిసి పనిచేసిన దోస్త్ ను మాత్రం మరిచిపోయాడు. మరిచిపోయాడా లేదంటే నిజంగానే పక్కనబెట్టాడా అనేది మాత్రం తెలియలేదు.
ఇండస్ట్రీలో ఉన్న గ్రేట్ కాంబినేషన్స్ లో త్రివిక్రమ్.. డిఎస్పీ ఒకటి. ఈ ఇద్దరూ కలిస్తే వచ్చే సినిమా సూపరే. ఇప్పటి వరకు జల్సా, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, జులాయి సినిమాలకు పనిచేసారు త్రివిక్రమ్, దేవీ. అన్నీ హిట్లే. పాటలైతే చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ను ఎవరూ విడిచిపెట్టరు. కానీ త్రివిక్రమ్ మాత్రం దేవిని కాదని అ..ఆ కోసం మిక్కీని తీసుకున్నాడు. ఇప్పుడు పవన్ కోసం అనిరుధ్ ను పట్టుకొచ్చాడు. నెక్ట్స్ ఎన్టీఆర్ కు కూడా ఆయనే కావాలంటున్నాడు. ఇదే కొత్త అనుమానాలకు తావిస్తుంది. త్రివిక్రమ్ తో దేవీకి ఏదో విషయంలో వాదన జరిగిందని తెలుస్తుంది.
మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా దేవీపై ఒకింత కినుక వహిస్తున్నాడని తెలుస్తోంది. ఈయన సర్దార్ సినిమా విషయంలో దేవీ పెద్దగా పట్టించుకోలేదని.. పాటలు కూడా చాలా ఆర్డినరీగా ఇచ్చాడనే కోపం ఉంది. ఆ విషయంలో అప్పుడే దేవికి తన అసహనాన్ని చూపించాడు పవన్ కళ్యాణ్. సరిగ్గా సర్దార్ నుంచే పవన్ కు కూడా దేవీ దూరమయ్యాడు. కాటమరాయుడుకు అనూప్ వచ్చాడు.. ఇప్పుడు అనిరుధ్ వచ్చాడు. నెక్ట్స్ కూడా దేవీ వస్తాడో లేదో క్లారిటీ లేదు. మరోవైపు కొరటాల కూడా దేవీకి ఆల్టర్ నేటివ్ కోసం వెతికే పనిలో ఉన్నాడని తెలుస్తోంది. మొత్తానికి దేవికి టాలీవుడ్ లో స్నేహాలన్నీ ఒక్కొక్కటిగా ఎందుకో దూరమవుతున్నాయి. దీనికి కారణమేంటో మరి..?