ఝాన్వీకపూర్ తొలి సినిమాతోనే విజయం అందుకుంది. ఈమె నటించిన ధడక్ వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఈ వారమే విడుదలైన ఈ చిత్రాన్ని శశాంత్ కైతాన్ తెరకెక్కించాడు. సైరాత్ కు రీమేక్ గా వచ్చిన ఈ చిత్రంపై తొలి రోజు కాస్త భిన్నమైన టాక్ వినిపించినా.. ఇప్పుడు అది పూర్తిగా తొలగిపోయింది. సినిమా కచ్చితంగా ఝాన్వీకి మంచి ఇమేజ్ తీసుకొచ్చేలా కనిపిస్తుంది.తొలి సినిమాలో గ్లామర్ కాకుండా పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్ చేయడంతో ఆ ఇమేజ్ అలాగే క్యారీ అవుతుంది.
సైరాత్ చూసిన వాళ్లకు ధడక్ పెద్దగా రుచించకపోయినా.. చూడని వాళ్లు మాత్రం పండగ చేసుకుంటున్నారు. కేవలం ఝాన్వీ కోసమే ఈ చిత్రాన్ని చూస్తున్న వాళ్లు కూడా లేకపోలేదు. తొలి మూడు రోజుల్లో ఇండియాలో 33 కోట్లు.. ఓవర్సీస్ లో 8 కోట్లు వసూలు చేసి.. 41 కోట్ల దగ్గర నిలిచింది ఈ చిత్రం. బాలీవుడ్ లో ఏ వారసురాలికైనా ఇదే హైయ్యస్ట్ ఓపెనింగ్స్.
ధడక్ జోరు చూస్తుంటే కనీసం 70 కోట్లకు పైగానే వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. మొత్తానికి తన కూతురు హీరోయిన్ గా నిలబడితే చూడాలనుకున్న శ్రీదేవి కల తీరిపోయింది. ఇప్పుడు ఆమె ఆత్మ ఎక్కడున్నా కూడా శాంతించే ఉంటుంది.