గత రెండు రోజులుగా యాంకర్ రవి అనే ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా కొన్ని మీడియా చానల్స్ మీద అసభ్య వ్యాఖ్యానాలు చేశాడంటూ కథనాలు వినబడుతున్నాయి. అయితే.. ఆ ట్విట్టర్ ఎకౌంట్ కీ తనకూ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు యాంకర్ రవి.
రవి మాట్లాడుతూ.. “నా సోషల్ మీడియా ఎకౌంట్స్ అన్నిట్నీ వ్యాక్డ్ అవుట్ మీడియా మెయింటైన్ చేస్తుంది. గత కొన్నేళ్లుగా నేను ట్విట్టర్ లో యాక్టివ్ గా లేను. కేవలం ఫేస్ బుక్ మాత్రమే వాడుతున్నాను. అయినా..
నా పేరుతో ఎవరో తెలియనివారు ట్విట్టర్ ఎకౌంట్ యూజ్ చేస్తూ నా పేరు మీద అసభ్య పదజాలంతో పోస్టులు పెడుతున్నారు. వారిపై నేను లీగల్ గా కేస్ వేసి ప్రొసీడ్ అవుతాను. మీడియా మిత్రులు ఎవరూ సదరు ట్వీట్స్ గురించి కన్ఫ్యూజ్ అవ్వొద్దని నా మనవి” అని వివరించాడు.
Anchor Ravi Official Handle :
Fake Account:
Tweets by AnchorRaviOffl