తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు గ్రేట్ విజనరీ ఉన్న దర్శకుడు అని ఈ తరంలో ఒక్క రాజమౌళిని మాత్రమే అంటున్నారు. ఆయన కాకుండా మరే దర్శకున్ని కూడా అంత పెద్ద మాట అనలేదు.. అనలేరు కూడా. కానీ ఇప్పుడు ఒకేఒక్క సినిమా అనుభవం ఉన్న నాగ్ అశ్విన్ కూడా ఇదే బిరుదు కోసం ట్రై చేస్తున్నాడు. అవును..
ఈయన విజనరీతో ఇప్పుడు అందరికీ పిచ్చెక్కిస్తున్నాడు అశ్విన్. చేసింది ఒక్కటే సినిమా.. అది కూడా మూడేళ్ల ముందు.. పేరు ఎవడే సుబ్రమణ్యం. సూపర్ హిట్ కాలేదు కానీ పర్లేదనిపించింది. ఇక ఇప్పుడు సావిత్రి బయోపిక్ తో ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకుంటున్నాడు ఈ దర్శకుడు. సినిమా తీయడం గొప్ప విషయం కాదు కానీ ఈ చిత్రం తెరకెక్కించిన తీరు ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యంలో పడే స్తుంది. గొప్ప దర్శకులు సైతం భయపడే సబ్జెక్ట్ ను రెండో సినిమాతోనే తీసుకున్నాడు నాగ్ అశ్విన్.
ఇక మహానటి కోసం ఈయన ఫాలో అవుతున్న పద్దతులు.. ప్రమోషన్ తీరు.. అందులో లెజెండ్స్ పాత్రల కోసం ఆయన ఎంచుకున్న ఈ తరం నటీనటులు.. వీళ్ళందర్నీ చూస్తుంటే నాగ్ అశ్విన్ ను నిజంగానే గ్రేట్ విజనరీ అనడంలో తప్పు లేదనిపిస్తుంది. దీన్ని ఓ అద్భుతంగా.. మహాకావ్యంలా నాగ్ తెరకెక్కించాడు. ఈయన పనితనం కూడా అలాగే ఉంది. ఇప్పుడు మహానటి గురించి మాట్లాడటం తక్కువే.
ఎందుకంటే రేపు సినిమా విడుదలైన తర్వాత మనోడి పనేంటో సినిమానే చూపిస్తుందంటున్నారు చిత్రయూనిట్ కూడా. మహానటి సావిత్రి పాత్ర నుంచి.. కేవీ రెడ్డి.. ఎల్వీ ప్రసాద్.. ఎస్వీఆర్.. ఇలా ఎవర్నీ తీసుకున్నా అచ్చు ఒరిజినల్ ను చూసినట్లుగానే ఉంది. మరి చూడాలిక.. ఈ కుర్రాడు చేసిన మాయేంటో మే 9న తెరపై చూద్దాం..