ఏ హీరో అయినా జీవితంలో ఒక్కసారైనా కెరీర్ లో ఇలాంటి పీక్ స్టేజ్ ఉండాలని కోరుకుంటాడు. నానికి ఇది వచ్చేసింది. వరసగా ఎనిమిది విజయాలు అందుకున్నాడు ఈ హీరో. ఈ హీరోను చూసి ఇప్పుడు ఇతర హీరోలు కుళ్లుకోలేదంటే అది కచ్చితంగా అబద్ధమే అవుతుంది. ఎందుకంటే ఆయన ఉన్న రేంజ్ అలాంటిది. ఒకటి రెండు కాదు.. ఏకంగా ఎనిమిది విజయాలతో దూకుడు మీదున్నాడు నాని. ఇప్పుడు ఈయన మార్కెట్ రేంజ్ చూసి అంతా షాక్ అవుతున్నారు. సరిగ్గా మూడేళ్ల కింద 10 కోట్లు కూడా లేని నాని మార్కెట్ ఇప్పుడు 40 కోట్లకు తగ్గడం లేదు. ఒక్కో సినిమాతో తన రేంజ్ అలా అలా పెంచుకుంటూ వెళ్తున్నాడు న్యాచురల్ స్టార్.
ఇప్పుడు ఈయన నటిస్తున్న కృష్ణార్జున యుద్ధం ఓవర్సీస్ హక్కులు రికార్డ్ స్థాయిలో అమ్ముడయ్యాయి. ఆ సినిమాను అక్కడ 4.14 కోట్లకు కొనేసారు అక్కడి బయ్యర్లు. ఎలా ఉంటుందో తెలియదు.. ఎలా వస్తుందో తెలియదు.. అసలు అంత అమౌంట్ వస్తుందో రాదో క్లారిటీ లేదు.. అయినా కానీ సినిమాను కొనేసారు. నాలుగు నెలల ముందే ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తైపోయింది. అది నాని రేంజ్ ఇప్పుడు. ఓవర్సీస్ లో మహేశ్ తర్వాత ఎక్కువ రికార్డులు నానికే సొంతం. ఇప్పటికే 5 మిలియన్ మార్క్ సినిమాలు అందుకున్నాడు నాని. 2017లో అయితే వరసగా మూడు సినిమాలు అందుకున్నాడు. ఇప్పుడు కృష్ణార్జున యుద్ధం కోసం పెట్టిన రేట్ రామ్ చరణ్ కంటే ఎక్కువ. ఎంసిఏ 3.5 కోట్లకు కొంటే బాగానే తీసుకొచ్చింది. దాంతో ఇప్పుడు ఆ రేంజ్ మరింత పెరిగిపోయింది. ఎప్రిల్ 12న ఈ చిత్రం విడుదల కానుంది. మేర్లపాక గాంధీ దర్శకుడు. ఈ చిత్రం గానీ హిట్టైతే ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టిన ఏకైక హీరోగా చరిత్ర సృష్టిస్తాడు నాని.