అవును.. ఇప్పుడు నానిని చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. వామ్మో ఏంటా కోపం..? ఏంటా కథ..? ఏంటా హోస్టింగ్..? అసలు మన నానినేనా ఇంతగా రెచ్చిపోతుంది అనిపిస్తుంది అక్కడ చూస్తుంటే. అంతగా దూసుకుపోతున్నాడు నాని. బిగ్ బాస్ లో ఈయన దూకుడు చూస్తుంటే ఎన్టీఆర్ ను కూడా మరిచిపోతున్నారు కొందరు. తొలి సీజన్ మొత్తంలో ఒక్కసారి కూడా హౌజ్ మేట్స్ పై ఎన్టీఆర్ అరిచిన సందర్భాలైతే లేవు. మరీ అయితే కాస్త కోపంగా కసురుకున్నాడేమో కానీ మరీ నానిలా రెచ్చిపోయింది అయితే లేదు. మరి ఎన్టీఆర్ లా చేస్తుంటే తనకు గుర్తింపు ఏం ఉంటుంది అనుకున్నాడో ఏమో కానీ ఇప్పుడు దూకుడు పెంచేసాడు నాని. తాజాగా జరిగిన ఎపిసోడ్ లో అయితే ఏకంగా తన విశ్వరూపమే చూపించేసాడు న్యాచురల్ స్టార్. ముఖ్యంగా బిగ్గర్ బాస్ బాబు గోగినేనిపై ఫైర్ అయ్యాడు. సంబంధమే లేకుండా బిగ్ బాస్ లోకి రాజమౌళి టాపిక్ వచ్చేసరికి నానికి కూడా చిర్రెత్తుకొచ్చింది.
అసలు దీనితో రాజమౌళికి ఏంటి సర్ సంబంధం అంటూ ఫైర్ అయ్యాడు నాని. ఎలా పడితే అలా మాట్లాడేస్తుంటే చూస్తూ కూర్చోవాలా అంటూ ఫైర్ అయ్యాడు నాని. మరోవైపు బాబు గోగినేని కూడా కౌశల్ పై ఫైర్ అయ్యాడు. ఆయనకు విలువలు లేవు అని.. నీతి నిజాయితీ లేని మనిషి అంటూ రెచ్చిపోయాడు బాబు. తనను ఇంటి నుంచి పంపించినా పర్లేదు కానీ కౌశల్ మాత్రం ఈ ఇంట్లో ఉండటానికి పనికిరాడంటూ రెచ్చిపోయాడు. అయితే బాబు స్పీడ్ కు బ్రేకులు వేస్తూ ఇంట్లో ఎవరు ఉండాలో.. ఎవరు ఉండకూడదో డిసైడ్ చేయాల్సింది మీరు కాదు ప్రేక్షకులు అంటూ సమాధానం ఇచ్చాడు. ఏదేమైనా ఒక్కో వారం గడుస్తుంటే.. బిగ్ బాస్ లో రచ్చ ఇంకా ఇంకా పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. మరి ముగిసేసరికి ఈ రచ్చ ఇంకెలా ఉండబోతుందో..?