అదేంటి.. విడుదలకు ముందు తన సినిమా కథ ఏ హీరో అయినా చెప్పుకుంటాడా..? అలా బయట పెట్టుకుంటాడా..? అది ఎలా సాధ్యం అసలు అనుకుంటున్నారా..? ఇక్కడ అదే సాధ్యమైంది. బన్నీ చెప్పాడు.. నా పేరు సూర్య నా యిల్లు ఇండియా కథ చెప్పేసాడు అల్లుఅర్జున్. అది కూడా కోట్ల మంది ప్రేక్షకుల సాక్షిగా..
ఆడియో వేడుకలో కథ చెప్పాడు బన్నీ. వక్కంతం వంశీ వచ్చి కథ చెప్పినపుడు తానేం వినలేదని.. సింపుల్ గా ఒక్క లైన్ కు మాత్రమే బాగా కనెక్ట్ అయ్యానని గుర్తు చేసుకున్నాడు అల్లుఅర్జున్. ఈ కథ విన్నపుడు మొత్తం ఒకటే లైన్ లో ఉంటుందని.. ఇందులో హీరో లక్ష్యం దేశానికి సైనికుడిగా వెళ్లి సేవ చేయడమే అని చెప్పాడు బన్నీ. సినిమా మొత్తం ఈ ఒక్క లైన్ తోనే ఉంటుందని చెప్పాడు బన్నీ. కథంతా ఆయన దేశానికి సేవ చేయడమే అని..
సైనికుడి కష్టం ఎలా ఉంటుందో ఈ చిత్రంలో తాను చూసానని.. ఇలాంటి సైనికులను ఇంటికొక్కరిని పంపిన ఈ మిలట్రీ మాధవరానికి నిజంగా కాళ్లకు నమస్కరిస్తున్నాని చెప్పాడు బన్నీ. మొత్తానికి కథ మొత్తం చెప్పకపోయినా.. మెయిన్ ప్లాట్ ఏంటో చెప్పేసాడు అల్లు వారబ్బాయి. ఇక మిగిలిన కథ కూడా తెలియాలంటే మే 4 వరకు ఆగాల్సిందే.