కొత్త టాలెంట్ ను ప్రోత్సహిస్తూ.. మహీధర్, సోనాక్షి సింగ్ లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ అశ్విని క్రియేషన్స్ బ్యానర్ పై జి.లక్ష్మి, కె. శేషగిరి రావు కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘నా లవ్ స్టోరీ’. ఈ సినిమాకు సంబంధించి ఆదిత్య మ్యూజిక్ ద్వారా సింగిల్ సాంగ్ రిలీజ్ ను హైదరాబాద్ రేడియో మిర్చిలో మ్యూజిక్ డైరక్టర్ వేద నివాస్, డైరక్టర్ శివ గంగాధర్, హీరో మహీధర్ మరియు ఈ సినిమాలో హీరో ఫాదర్ గా నటించిన తోటపల్ల మధు పాల్గొని ఈ సినిమాలో హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ డ్యూయెట్ సరిగ్గా విన్నానా.. సరిగ్గా విన్నానా అనే సాంగ్ ని విడుదల చేశారు.
హీరో మహీధర్ మాట్లాడుతూ, ”ఈ సినిమాతో నన్ను హీరోగా పరిచయం చేస్తున్న డైరక్టర్ శివ గారికి స్పెషల్ థ్యాంక్స్. సినిమా బాగా వచ్చేవరకు శివ గారు నా తాట తీశారు. సినిమా మీద ఆయనుకున్న ప్యాషన్ అలాంటిది. నా లవ్ స్టోరీ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు. భువనచంద్ర గారు రాసిన లిరిక్స్ చాలా అద్భుతమని, ఈ పాట సినిమాలో విజువల్ గా కూడా చాలా బాగా వచ్చిందని, ఈ సాంగ్ ను బ్యాంకాక్ లో షూట్ చేశామ”న్నారు.
డైరక్టర్ శివ మాట్లాడుతూ.. ”నా లవ్ స్టోరీ, ఇదొక రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా ఉండబోతుంది. నాకు ఈ అవకాశమిచ్చిన అశ్విని క్రియేషన్స్ బ్యానర్ ను బాగా నిలబెడతారని అనుకుంటున్నాను. యూత్ కు చాలా బాగా నచ్చే చిత్రమిది. ప్రతి ఆడవాళ్లూ ఈ చిత్రాన్ని తప్పక చూడాలి. ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని ఒక కొత్త పాయింట్ ను ఈ చిత్రంలో చాలా కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాన”న్నారు.
మ్యూజిక్ డైరక్టర్ మాట్లాడుతూ, ”ఆదిత్య మ్యూజిక్ ద్వారా నేను సంగీతం సమకూర్చిన పాటల్ని ఇలా రేడియో మిర్చి లో విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. పాటలు కూడా చాలా బాగా వచ్చాయి. మొత్తం ఆల్బమ్ లో నాలుగు పాటలున్నాయి. ప్రతి పాట చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరిస్తారనుకుంటున్నాను”.
తోటపల్లి మధు మాట్లాడుతూ, ”ఈ సినిమాలో నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరక్టర్ శివ గారికి చాలా థ్యాంక్స్. అందరి నుంచి చాలా మంచి నటన రాబట్టుకున్నారు. మహిధర్ సినిమాలో నటించాడు అనేకంటే జీవించాడు అనడమే కరెక్ట్. ఈ సినిమాతో శివ చాలా మంచి డైరక్టర్ గా పేరు తెచ్చుకుంటాడు” అన్నాడు.
నటీనటులుః మహీధర్, సోనాక్షి సింగ్, తోటపల్లి మధు, శివన్నారయణ, చమ్మక్ చంద్ర, డి.వి లతో పాటూ, కొత్త ట్యాలెంట్ ను ప్రోత్సహిస్తూ క్రమంలో మరికొందరు నూతన నటీనటులు కూడా వెండితెరకు పరిచయం కానున్నారు.
సాంకేతిక నిపుణులుః
సినిమాటోగ్రఫీః కిరణ్
పీ.ఆర్.ఓః గాండ్ల శ్రీనివాస్ (జీఎస్ మీడియా)
ఎడిటర్ః నందమూరి హరి
సంగీతంః వేద నివాస్
డైలాగ్స్ః మల్కారి శ్రీనివాస్
బ్యానర్ః అశ్విని క్రియేషన్స్
కో-డైరక్టర్ః సేతుపతి
డైరక్టర్ః జి. శివ గంగాధర్