పిల్ల దొరకలేదు కానీ అప్పుడే పెళ్లి గురించి ఆలోచిస్తున్నాడు నితిన్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా టాలీవుడ్ లో ఉన్న ఈ హీరో ఇప్పుడు పెళ్లి కాన్సెప్ట్ తో వరస సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు మరో విషయం పట్టించుకోకుండా కేవలం కళ్యాణంపైనే ఫోకస్ చేసాడు. ఈ మార్చ్ లోనే పెళ్లి పనులు కూడా మొదలైపోయాయి. అయితే ఇదంతా రియల్ పెళ్లి కోసం కాదు లెండీ..! రీల్ పెళ్లి కోసమే.
ఈయన నటిస్తున్న శ్రీనివాస కళ్యాణం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్ర చివరి షెడ్యూల్ ఇప్పుడు జరుగుతుంది. ఈ చిత్రం ఆగస్ట్ 9న విడుదల కానుంది. దీనికి తగ్గట్లుగా షూట్ పూర్తి చేస్తున్నాడు సతీష్ వేగేశ్న. శ్రీ గా రాశీ.. నివాస్ గా నితిన్ నటిస్తున్నారు. ఈ శ్రీనివాస్ ల కళ్యాణమే శ్రీనివాస కళ్యాణం. శతమానం భవతి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సతీష్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
శతమానం భవతిని 47 రోజుల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్తించిన సతీష్ వేగేశ్న.. ఇప్పుడు శ్రీనివాస కళ్యాణంను కూడా ఇదే చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని కూడా 60 రోజుల్లోపే పూర్తి చేయాలనేది ఈ దర్శకుడి ప్లాన్. దీనికి తగ్గట్లే అంతా సిద్ధం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం నితిన్ ఫ్లాపుల్లో ఉన్నాడు.
గతేడాది వచ్చిన లైతో పాటు మొన్నొచ్చిన ఛల్ మోహన్ రంగా కూడా డిజాస్టరే. శ్రీనివాస కళ్యాణంతో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ సినిమాకు కూడా కమిటయ్యాడు నితిన్. ఈ చిత్రం కూడా పెళ్లి కాన్సెప్ట్ తోనే వస్తుంది. శ్రీనివాస కళ్యాణంలో పెళ్లి చేసుకోమంటే.. ఇందులో వద్దంటూ ప్రచారం చేయబోతున్నాడు. మొత్తానికి ఈ రెండు సినిమాలతో నితిన్ హిట్ కొట్టి మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్నాడు.