కొన్నిసార్లు టైటిల్స్ తో కూడా సినిమాపై ఆసక్తి పెరిగిపోతుంది. ఇప్పుడు నీదినాది ఒకేకథ కూడా ఇలాంటిదే. అసలు ఈ టైటిల్ విన్నపుడే ఏంట్రా బాబూ టైటిల్ ఇలా ఉంది అనుకున్నారంతా. ఇప్పుడు విడుదలకు దగ్గర పడుతున్న కొద్దీ సినిమాపై అంచనాలు.. ఆసక్తి పెరిగిపోతున్నాయి. ఈ టైటిల్ పెట్టడానికి రీజన్ కూడా ఉంది. ఇందులో హీరో కారెక్టరైజేషన్ ఈ టైటిల్ కు మూలం. నీదినాది ఒకేకథ అనేది ప్రతీ ఇంట్లో జరిగేదే. కొడుకు పెద్దగా చదువుకోకుండా ఇష్టమొచ్చినట్లు జులాయిగా తిరగడం.. తండ్రి కోప్పడటం.. తర్వాత ఏదో ఒకటి చేయడం.. ఇలా ప్రతీ విషయం ప్రతీ ఇంట్లో నిత్యం చూస్తుంటాం. అందుకే ఈ కథకు నీదినాది ఒకేకథ అనే టైటిల్ పెట్టారు. సచిన్ ను కానీ వాళ్ల నాన్న చదువుకో అనుంటే ప్రపంచం క్రికెట్ దేవున్ని మిస్ అయిపోయేదిగా అంటూ ప్రమోట్ చేస్తున్నారు యూనిట్. ఇలాగే ఉంటుంది సినిమా కథ కూడా. అంటే పిల్లల ఆలోచనలను పేరెంట్స్ అర్థం చేసుకోవాలనే కాన్సెప్ట్ ఇది. శ్రీవిష్ణు ఇందులో హీరో. ఈ మధ్య ఈయన సినిమాలు ప్రేక్షకుల బుర్రల్లో బాగానే రిజిష్టర్ అవుతున్నాయి. దానికి అప్పట్లో ఒకడుండేవాడు.. ఉన్నది ఒకటే జిందగీ.. ఈ మధ్యే మెంటల్ మదిలో. ఇప్పుడు నీదినాది ఒకే కథ.. వరసగా డిఫెరెంట్ కథలో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు ఈ హీరో. ఇప్పుడు గానీ నీదినాది ఒకేకథ ఆడిందంటే శ్రీవిష్ణుకు మంచి గుర్తింపు రావడం ఖాయం. మార్చ్ 23న ఎమ్మెల్యేకు పోటీగా ఈ చిత్రం విడుదల కానుంది. మరి చూడాలిక.. ఏం జరుగుతుందో..? కొత్త దర్శకుడు వేణు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.