హృతిక్ రోషన్ జీవితంలో మరోసారి పెళ్లి కళ రాబోతుంది. ఇప్పటికే ఈయనకు ఓ సారి పెళ్లైంది. భార్య సుజానాతో విడాకులు తీసుకున్నాడు. కానీ ఇప్పటికీ ఆమె ఊహల్లోనే ఉన్నాడు ఈ హీరో. భార్యతో విడిపోయిన మాటే కానీ ఇప్పటికీ ఆమెతో కలిసి సినిమాలు షికార్లు పార్టీలు అంటూ తిరుగుతూనే ఉంటాడు. మరోవైపు సుజానా కూడా మాజీ భర్తపై ఎనలేని ప్రేమ చూపిస్తుంటుంది. ప్రేమించే పెళ్లి చేసుకున్నారు హృతిక్, సుజానే. కొన్నేళ్ల పాటు ఆదర్శ దంపతుల్లా ఉన్నారు. కానీ మధ్యలో చిన్న మనస్పర్థలు వచ్చాయి. సుజానకే మరో హీరోతో ఎఫైర్ ఉందనే వార్తలొచ్చాయి. పైగా కంగనతో హృతిక్ యవ్వారం కూడా ఇష్యూను సీరియస్ చేసింది. దాంతో ఇద్దరూ విడిపోయారు. కానీ విడిపోయినా ఇద్దరి మనసులు మాత్రం కలిసే ఉన్నాయి. ఎక్కడ కలిసినా కూడా ఇద్దరూ ప్రేమగా ఆప్యాయంగా కలిసి పోతున్నారు. ఈ మధ్యే హృతిక్ బర్త్ డేలో కూడా సుజానే మనసును తాకే మాటలు చెప్పింది. నా జీవితంలో వెలుగు ఎప్పుడూ నువ్వే.. నువ్వు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానంటూ మాజీ భర్తతో కలిసి ఫోటో దిగింది సుజానే. ఇదే సమయంలో హృతిక్ కూడా అదే అంటున్నాడు. అంతేకాదు.. త్వరలోనే ఈ ఇద్దరూ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటో మరి.. హృతిక్ రెండో పెళ్లి చేసుకుంటున్నాడు కానీ తన భార్యనే చేసుకోవడం మాత్రం విచిత్రమే.