నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు 150 బృందాలుగా ఏర్పడిన పోలీసులు అనేక చోట్ల బారికేడ్లు ఏర్పాటుచేసి శ్వాస పరీక్షలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా సుమారు 1500కు పైగా వాహనాలను స్వాధీనం చేశారు. మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేయగా, సీజ్ చేసిన వాహనాలను ఆయా పరిధిలోని పోలీస్స్టేషన్లకు తరలించారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారికి మంగళవారం కౌన్సిలింగ్ నిర్వహించి అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇందులో యాంకర్ ప్రదీప్ తో పాటు పలువులు ప్రముఖులా వాహనాలు కుడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు.