శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యాలు చేసిన కత్తి మహేష్‌పై నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని హైదరాబాద్ నుంచి కత్తి మహేష్‌ను బహిష్కరించిన విషయం తెలిసిందే.
హిందూ సమాజం పై జరుగుతున్న దాడులకు నిరసిస్తూ స్వామి పరిపూర్ణానంద హైదరాబాద్ నుండి యాదాద్రి కి కవాతు నిర్వహించ అనుమతి కోరగా పోలీసులు ఆయన మీద కూడా నగర బహిష్కరణ వేటు వేశారు. గత సంవత్సరం రాష్ట్రీయ హిందూ సేన ఆవిర్భావ ప్రసంగంలో స్వామి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ.. వాటికి సమాధానం ఇవ్వనందున ఆయన పై 6 నెలల బహిష్కరణ విధించారు. తాజాగా కత్తి మహేష్ పరిపూర్ణానంద బహిష్కరణ ను ఖండించడం చర్చనీయాంశమయ్యింది.
“పరిపూర్ణానంద నగర బహిష్కరణను ఖండిస్తున్నాను. బహిష్కరణలు ఈ సమస్యకు పరిష్కారం కాదు.బహిష్కరణ ఆధునిక ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.మనుషుల్ని “తప్పిస్తే” సమస్యలు తప్పుతాయి అనే ఆటవిక సమాజం దిశగా ప్రభుత్వాలు పయనిస్తే అది తిరోగమనమే అవుతుంది,” అని కత్తి ట్విట్టర్లో పేర్కొన్నారు.