‘ఎక్కడ నెగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు’..పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది లో అన్న డైలాగ్ ఇప్పుడు గుర్తుచేసుకోవాలి. పవర్ స్టార్ పేరు అనవసరమైన విషయాలలో లాగి ఈ మధ్య చాలామంది వార్తల్లో నిలుస్తున్నారు. అందులో కత్తి మహేష్ ఒక్కడు. పవన్ కళ్యాణ్ పై బురద చల్లడమే పనిగా పెట్టుకున్న కత్తి మహేష్ ఎంత రచ్చ చేసాడో అందరికి తెలుసు, అయితే పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంపై వేక్తిగత జీవితంపై ఎన్నో ట్వీట్ లు వేసిన కత్తి, పవన్ కళ్యాణ్ స్పందించాలి అని మొత్తుకున్నాడు. తనపై కుట్ర చేసిన శ్రీ రెడ్డి, ఆర్జీవీ…etc వాళ్ల వెనక ఎవరు ఉన్నారో అని ఒక్క ట్వీట్ తో చెప్పిన పవన్ కి ఇప్పుడు కత్తి మహేష్ ఏం స్పందిస్తాడో చూడాలి మరి? ఇన్ని రోజులు ఎందుకు మౌనంగా తగ్గి ఉన్నారో కత్తి కి అర్థమై ఉండవచ్చు. ఇక మీదట అయినా ఎవరికి విల్లు ఎక్కి పెడుతున్నాం అని ఒక్కసారి ఆలోచించుకొని మాటల బాణం వదలాలి అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.