పవన్ కు ఇస్తే జగన్ కి ఇవ్వాల్సివస్తుంది

టీడీపీ కి గుడ్బై చెప్పి రేవంత్ కాంగ్రెస్ లో చేరడంతో తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.   ఆంధ్ర ప్రదేశ్ లో కూడా రాజకీయ వాతావరణం త్వరలో వేడెక్కనుంది. ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ పాదయాత్ర చేయాలని తలిస్తే, ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తుంది. జగన్ పాదయాత్ర ప్రశాంతం గా చేస్తే పర్వాలేదని, కానీ ఆయన ప్రజలను రెచ్చగొట్టి ఉద్రిక్త వాతావరణం సృష్టించి అలజడి రేపడానికే పాదయాత్ర చేయబూనారని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. 2004 ఎన్నికల ముందు దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి  పాదయాత్ర చేయడంతోనే ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు.
Pawan Kalyan and YS Jagan planning padayatra
మరో వైపు జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాదయాత్ర చేయాలని చూస్తున్నారు. అయితే ఆయనకు ఉన్న సినిమా గ్లామర్ నిమిత్తం జనం విపిరీతంగా ఎగబడి తొక్కిసలాటలు వంటి అవాంతరీయ సంఘటనలకు అవకాశం ఉన్నందున పవన్ కు కూడా పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవచ్చని సమాచారం. పవన్ 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా ఉన్న విషయం తెలిసిందే. పవన్ కు ఇస్తే జగన్ కు కూడా అనుమతి ఇవ్వాల్సివస్తుందని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు తికమక పడుతున్నారట. అందుకే పవన్ కి కూడా నిరాకరించి ఆయన్ను కావాలంటే బస్సు యాత్ర చేయమని సలహా ఇచ్చారట!