పాకిస్థాన్ అమెరికాతో డబుల్ గేమ్ ఆడుతోంది అని ఐఖ్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలి వ్యాఖ్యానించారు. ఇప్పటికే ట్రంప్ పాకిస్థాన్‌ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలతో రూ.1700 కోట్ల నిధులను నిలిపి వేస్తున్నట్లు అమెరికా ప్రకటించగా ఇంకో కొన్ని చర్యలు తీసుకోడానికి సిద్ధమవుతున్నారు. నిక్కీ హేలి మాట్లాడుతూ ‘ఉగ్రవాదాన్ని ఆపే శక్తి పాకిస్థాన్‌కు ఉంది. ఆ పని పాక్ చేయాలి. పాక్ నుంచి మేమూ అదే ఆశిస్తున్నాం. మరో 24 నుంచి 48 గంటల్లో పాక్‌పై మేము మరిన్ని చర్యలు తీసుకోబోతున్నాం.’ అని తెలిపారు.