పాకిస్థాన్.. ఈ మాట వింటేనే ప్రతీ భారతీయుడి గుండె కోపంతో రగిలిపోతుంది. అదేంటో తెలియదు కానీ భారతీయులందరికీ తొలి శత్రువు పాకిస్థానే. దానికి ప్రత్యేకంగా కారణాలతో పనిలేదు. మన నరనరాల్లో పాక్ పై అలా పగ పెరిగిపోయింది అంతే. ఇప్పుడు రాజమౌళి కూడా ఇదే చెప్పాడు. కరాచీ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్నాడు రాజమౌళి. ఈ మధ్యే ఈయన పాకిస్థాన్ వెళ్లాడు. అక్కడ ఉండి వాళ్ల దేశంపైనే సెటైర్లు వేసాడు దర్శకధీరుడు. మన బాహుబలి కరాచీ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికైంది. ఇప్పటి వరకు ఏ ఇండియన్ దర్శకుడికి దక్కని అరుదైన గౌరవం ఇప్పుడు దక్కించుకున్నాడు మన జక్కన్న. కరాచీ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. తర్వాత రాజమౌళి మాట్లాడుతూ పాక్ గురించి కొన్ని మంచి విషయాలు కూడా చెప్పాడు. తన మాటలతో అక్కడి వాళ్ల మనసు దోచుకున్నాడు రాజమౌళి. ముఖ్యంగా పాక్ పై మీ అభిప్రాయం ఏంటి అని అడిగితే చిన్నప్పటి నుంచి మాకు పాక్ అంటే ఎనిమీస్.. మరీ ముఖ్యంగా వసీం అక్రమ్ మాకు బిగ్గెస్ట్ ఎనిమీ అని చెప్పాడు దర్శకధీరుడు. ఇక ఆ తర్వాత పెద్దవుతున్న కొద్దీ అంతా సింపుల్ మనలాంటి పీపుల్.. అంతా ఒక్కటే అని అర్థమైందని చెప్పాడు రాజమౌళి. ఈ సమాధానంతో దర్శకధీరున్ని చప్పట్లతో మోత మోగించారు. జక్కనతో ఫోటోలు దిగడానికి అక్కడి టాప్ సెలెబ్రెటీస్.. టెక్నీషియన్స్.. సూపర్ స్టార్స్ కూడా పోటీ పడ్డారు. ఇదంతా చూసిన తర్వాత ప్రతీ ఇండియన్ గుండె ఆనందంతో ఉప్పొంగిపోవడం ఖాయం. మన దర్శకుడిని ఇలా పాక్ కు పిలవడమే ఓ గొప్ప విషయం అనుకుంటే.. ఆయన్ని ఆకాశానికి ఎత్తడం మరింత గొప్ప.