పులిపిల్ల‌కు బ్రేక్ ప‌డిపోయిందిగా.. 

అదృష్టం మెయిన్ డోర్ కొడితే.. బ్యాక్ డోర్ నుంచి దుర‌దృష్టం వ‌చ్చి త‌న్నుకెళ్లిపోయింద‌ట‌. నికీషా ప‌టేల్ ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఈ భామ అదృష్టాన్ని చూసి అప్ప‌ట్లో చాలా మంది కుళ్లుకున్నారు కూడా. తొలి సినిమానే ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో న‌టించే అవ‌కాశం వ‌స్తే కుళ్లుకోరా మరి. కానీ ఏం చేస్తాం.. ఈ భామ న‌టించిన తొలి సినిమా పులి చ‌రిత్ర‌లో నిలిచిపోయే డిజాస్ట‌ర్ గా మారింది. దాంతో నికీషాను క‌నీసం ప‌ట్టించుకోలేదు ఈ ద‌ర్శ‌క నిర్మాత‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోయిన్ అనే ముద్ర మిన‌హా ప‌వ‌ర్ స్టార్ నికీషా కెరీర్ కు ఏ ర‌కంగానూ హెల్ప్ కాలేదు. ఇప్ప‌టికీ ఈ భామ‌ను పులి హీరోయిన్ అనే అంటారు. ఈ మ‌ధ్యే సాయిరాం శంక‌ర్ తో అర‌కురోడ్ లో అనే సినిమా చేసింది నికీషా. ఈ సినిమాలో ఏ మాత్రం సంకోచించ‌కుండా అందాలు ఆర‌బోసింది. కానీ ఏం లాభం.. సినిమా వ‌చ్చెళ్లిన‌ట్లు కూడా ఎవ‌రికీ తెలియ‌దు. దాంతో చేసేదేం లేక అందాల‌కు మెరుగులు దిద్దేస్తుంది నికీషా ప‌టేల్. తాజాగా గుర్తు కూడా ప‌ట్ట‌నంత మేకోవ‌ర్ అయిపోయింది ఈ బ్యూటీ. బొద్దుగుమ్మ కాస్తా.. కాస్త బ‌రువు త‌గ్గింది. ఈ మ‌ధ్య ఏకంగా బికినీ షో లో కూడా మెరిసింది. ఈ భామ కెరీర్ గాడిన ప‌డాలంటే పై నుంచి దేవుడు దిగివ‌చ్చి వ‌రాలు ఇవ్వాల్సిందే. అలా చేసినా కూడా పులి పిల్ల కెరీర్ ఒడ్డున ప‌డుతుందో లేదో తెలియ‌దు..! ప్ర‌స్తుతానికి వ‌చ్చిన ఆఫ‌ర్ల‌ను చేసుకుంటూ వెళ్తుంది ఈ ముద్దుగుమ్మ‌. అందుకే అడిగినంత అందాలు ఆర‌బోస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here