ఒకటి రెండు మూడు.. ఇలా ఏళ్లు గడిచిపోతున్నాయి.. కేలండర్స్ మారిపోతున్నాయి.. కానీ ఆమె అందం మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. అప్పుడెప్పుడో 18 ఏళ్ల కింద ఆమెను తొలి సినిమాలో ఎలాగైతే చూసామో ఇప్పటికీ అలాగే కనిపిస్తుంది. ఇన్నేళ్లు ఒకే ఫిజిక్ ఉండాలంటే.. దాని వెనక ఎంత కష్టం దాగుందో పాపం..! మనం మాట్లాడుకుంటున్నది శ్రీయ గురించే. ఈమెతో పాటు వచ్చిన ముద్దుగుమ్మలంతా ఇప్పటికీ ఆంటీలు అయిపోయారు.. కొందరు అమ్మలు కూడా అయిపోయారు. కానీ ఇప్పటికీ శ్రీయ మాత్రం హీరోయిన్ గానే ఉంది.
ఈ మధ్యే పెళ్లి కూడా అయింది ఈ భామకు. అయినా కూడా ఇప్పటికీ అందాల ఆరబోతలో మాత్రం తగ్గడం లేదు శ్రీయ. ఇప్పటికీ తమిళ్ లో కార్తిక్ నరేన్ తెరకెక్కిస్తోన్న నరగాసురన్ లో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఫారెన్ వీధుల్లో క్లీవేజ్ షోలతో చంపేస్తుంది శ్రీయా. ఇప్పటికీ అదిరిపోయే ఫిజిక్ తో హాట్ ఫోటోషూట్లతో మతులు పోగొట్టేస్తోంది ఈ భామ. ఈ మధ్యే బీచ్ లో అదిరిపోయే బికినీ షో చేసింది. ఇక మొన్న స్విమ్మింగ్ పూల్ లో కాళ్లు బయటికి పెట్టుకుని కూర్చున్న శ్రీయాను చూసి కుళ్లుకున్నారు ముద్దుగుమ్మలు.
ఐదేళ్లు పర్ ఫెక్ట్ ఫిజిక్ మెయింటేన్ చేయడానికే నానా తిప్పలు పడుతున్న ఈ రోజుల్లో.. ఏకంగా 17 ఏళ్లు ఒకేలా కనిపించడం అంటే చిన్న విషయం కాదు. ఆ సీక్రేట్ ఏంటో మిగిలిన హీరోయిన్లకు కూడా చెబితే కాస్త హెల్ప్ అవుతుంది కదా శ్రీయా..?