మన దేశాన్ని తెల్లవాళ్లు విభచించి వెళ్తే వాళ్ళ వారసత్వం మన రాజకీయ నాయకులూ తీస్కున్నట్టు ఉన్నారు. బాషా ప్రాంతం సరిపోనట్టు మతం తో కూడా కుల్లు రాజకీయాలు మానట్లేదు అందుకు నిదర్శనమే బిజెపి నేత, కేంద్ర మంత్రి అనంతకుమర్ హెగ్డే. హిందూత్వం జాతీయత ఒకటేనని మతాన్ని జాతాయత తో కలిపి చిచ్చు లేపారు. దీనికి ప్రకాష్ రాజ్ ఘాటుగా సామదానం ఇచ్చారు.ఇస్లాం మతాన్ని ప్రపంచంలోనే లేకుండా చేయాలని ఈయనగారు భావిస్తున్నారేమోనంటూ అనంతకుమార్ మాట్లాడిన వీడియోను పోస్టు చేశారు. ఆ రెండూ ఒకటేనని అంటున్నప్పుడు అసలు మతం విషయాన్ని లేవనెత్తటం ఎందుకు? అంబేద్కర్, అబ్దుల్ కలాం, రెహమాన్, కుష్వంత్ సింగ్, అమృత ప్రీతమ్, డాక్టర్ కురియన్ వీరంతా ఎవరు?. నాలాగా మతాన్ని కాకుండా మానవత్వాన్ని నమ్మేవారి పరిస్థితి ఏంటి? మేం ఈ దేశానికి చెందిన వాళ్లం కాదా? అసలు మీ ఏజెండా ఏంటి? పునర్జన్మను బలంగా నమ్మే మీరంతా నియంత హిట్లర్‌కు ప్రతీకలా? సెక్యులర్ దేశం మనందరిది. ఈ సిగ్గులేని రాజకీయాలతో మీకు ఒరిగేది ఏంటి?