ప్రదీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకగా టీవీ వాళ్ళు మరియు నెటిజన్స్ అందరు కలిసి ఆడేసుకున్నారు. అదృష్టమో లేక దురదృష్టమో తెలీదు కానీ ఎక్కడ నోరు కుడా జారని ప్రదీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికాడు. ఇదే చాన్సుగా తీస్కొని చానెల్స్ ఒకే వీడియోని మళ్ళి మళ్ళి చూపించి ప్రదీప్ ను బద్నామ్ చేసారు. తాగి నడపకండి అని ఒక వీడియో ప్రమోట్ చేసిన పాపానికి ప్రదీప్ ను అందరూ ఆడి పోసుకుంటున్నారు. సినిమా మొదలు అయ్యేముందు ధూమ పానం మద్యపానం హానికరం అన్న హీరో లే సినిమాలో మద్యం తాగుతూ కనిపిస్తారు మరి వాళ్ళని వారి అభిమానులు గాని, ప్రేక్షకులు గాని, మీడియా గాని ఏమి అనరు.
ఇంకా ఒక్క అడుగు ముందుకేసి ఆలోచిస్తే, మందు తాగి నడపకండి అని టీవీ యాడ్స్ వేయమని చెప్పే గవర్నమెంట్ మద్యం షాప్లకి విచ్చలవిడిగా లైసెన్స్ ఇస్తుంది, మరి సో కాల్డ్ రెస్పాన్సిబిల్ సిటిజన్స్ ప్రభుత్వాన్ని కడిగిపారేయరేమి. ఆరోగ్యానికి హానికరం అని మ్యాగీ నూడుల్స్ రోజులోనే ఎక్కడా లేకుండా చేసిన ప్రభుత్వం మరి సిగెరెట్ మందు అంత కంటే ఎక్కువ ఆరోగ్యానికి హానికరకం మరి వాటిని బ్యాన్ చేయరా, అలాంటి వాటిని నిషేధించడానికి మాత్రం నెటిజన్లు గొడవ చేయరు. ఏ బాక్గ్రౌండ్ లేకుండా వచ్చి తనకంటూ ఒక పేరుని తెచ్చుకున్న ప్రదీప్ ని మాత్రం ఏకిపారేస్తారా. తన తప్పు తెలుసుకొని క్షమాపణలు చేప్పిన ప్రదీప్ వీడియోని ఏ మాత్రం వైరల్ చేస్తారో వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నాము.