సమ్మర్ కే సెగలు పుట్టించేస్తుంది ప్రియాంక చోప్రా. బట్టలు ఎక్కువైపోతే ఉక్కపోత కూడా ఎక్కువే ఉంటుందనేమో కానీ అస్సలు క్యాస్ట్యూమ్స్ పెద్దవి వేసుకోవడమే మానేసంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా మరోసారి తన హాట్ షోతో చంపేసింది ప్రియాంక చోప్రా. పైగా హాలీవుడ్ వెళ్లిన తర్వాత అసలు ఇండియన్ ఇండస్ట్రీని పట్టించుకోవడమే మానేసింది ప్రియాంక చోప్రా.
రోమ్ లో ఉన్నపుడు రోమన్ లా ఉండాలన్నట్లు హాలీవుడ్ లో ఉంది కాబట్టి అక్కడి పరిస్థితులకు తగ్గట్లు మారిపోయింది. హాట్ సీన్స్ విషయంలో ప్రియాంక రెచ్చిపోతున్న తీరు చూస్తుంటే ముక్కున వేలేసుకోవాల్సిందే. అసలు ఇన్నాళ్లూ మన దగ్గర ఉన్న ప్రియాంక చోప్రానేనా ఈ సీన్స్ లో నటిస్తుంది అనుకోక తప్పదేమో..?
ఆ మధ్య బేవాచ్ లో బికినీలు వేసుకుని రచ్చ రచ్చ చేసింది ప్రియాంక చోప్రా. ఆ మధ్య క్వాంటికో సీజన్ 2లో సహ నటుడితో రెచ్చిపోయిన ప్రియాంక.. మూడో సీజన్ కు రెడీ అయింది. ఈ మధ్యే హిందీలో సల్మాన్ ఖాన్ తో సినిమా చేయడానికి ఒప్పుకుంది ప్రియాంక చోప్రా. ఇదిలా ఉండగానే హాలీవుడ్ ను కూడా వదలడం లేదు పిగ్గీచోప్స్. మొత్తానికి హాట్ ఫోటోషూట్లతో ఎప్పటికప్పుడు తాను ఉన్నానంటూ గుర్తు చేస్తుంది ఈ భామ.