నీదినాది ఒకేకథ.. టైటిల్ వినడానికే ఆసక్తికరంగా ఉంది కదా. కథ అంతకంటే ఆసక్తికరంగా ఉంటుందంటున్నాడు దర్శకుడు వేణు ఉడుగుల. ప్రతీ రోజు మనం ఇంట్లో చూసే కథే ఈ చిత్రం. తండ్రి కోరుకున్న జాబ్ లో కొడుకు జాయిన్ అవ్వడు.. వాడికి నచ్చిందే వాడు చేస్తుంటాడు.. అది తండ్రికి నచ్చదు.. అలాగని కొడుకును వదులుకోలేడు.. చదువు లేనంత మాత్రానా ఏం కాదని కొడుకు అనుకుంటాడు.. చదువుకోకపోతే ఏమైపోతాడో అని తండ్రి బాధ పడుతుంటాడు. ఇది అన్ని ఇళ్లలో జరిగే కథే. ఇదే ఇప్పుడు నీదినాది ఒకేకథ అయింది. సచిన్ ఇంట్లో గానీ ఆయన్ని క్రికెట్ కాదని.. చదువుకో అని చెప్పుంటే సచిన్ ఉండేవాడు కాదు కదా.. అని పోస్టర్స్ లో ప్రమోషన్ చేస్తున్నారు. ఇలాంటి పేరెంట్సే మీ ఇంట్లోనూ ఉంటే అయితే నీదినాది ఒకేకథ అని చెబుతున్నాడు దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. నారా రోహిత్ సమర్పించిన ఈ చిత్రానికి కృష్ణవిజయ్, ప్రశాంతి నిర్మాతలు. మార్చ్ 22 రాత్రి నుంచే భారీగా ప్రీమియర్స్ పడుతున్నాయి. మరి చూడాలిక.. ఈ చిత్రంతోనైనా శ్రీవిష్ణు హీరోగా తొలి విజయం అందుకుంటాడో లేదో..?