ఒక్కోసారి అంతే.. వరసగా సినిమాలు చేస్తూ సడన్ గా మాయమైపోతుంటారు. ఆ మధ్య తెలుగుతో పాటు కన్నడ ఇండస్ట్రీని కూడా ఊపేసిన ప్రణీత.. ఉన్నట్లుండి మాయమైపోయింది. ఏమైందో.. ఎక్కడుందో తెలియదు ఏడాదిగా ప్రణీత గురించి పెద్దగా ఏం తెలియదు. అప్పట్లో ఓ యాక్సిడెంట్ నుంచి బయటపడిన బాపుబొమ్మ.. తర్వాత సినిమాలకు కూడా దూరమైంది. ఆఫర్లు రావడం లేదో లేదంటే తానే కావాలని దూరంగా ఉంటుందో తెలియదు కానీ ఇప్పుడు ప్రణీత పేరే మరిచిపోయారు తెలుగు ఆడియన్స్. అత్తారింటికి దారేదిలో బాపు బొమ్మగా అందరికీ బాగా దగ్గరైన బ్యూటీ ప్రణీత. దానికి ముందే కొన్ని సినిమాలు చేసినా ఆమెను పట్టించుకోలేదు ప్రేక్షకులు.. దర్శక నిర్మాతలు. కానీ పవన్ తో నటించిన తర్వాత రభస లాంటి సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా అవకాశాలు బాగానే వచ్చాయి. కొన్నాళ్లుగా అవి కూడా రావట్లేదు. దాంతో అందరి ముద్దుగుమ్మల మాదిరే అందాల ఆరబోతకు తెరతీసింది. చిన్నచిన్న డ్రస్సుల్లో మతులు పోగొట్టే ప్రోగ్రామ్ పెట్టేసింది ప్రణీత. తాజాగా చాలా రోజుల తర్వాత ప్రణీత కెమెరా ముందు కనిపించింది. ఓ ఈవెంట్ లో ప్రేక్షకులకు దర్శనమిచ్చింది ఈ బాపుబొమ్మ. సన్నగా మెరుపుతీగలా మారిపోయిన ప్రణీతను చూసి వావ్ అనుకుంటున్నారు ప్రేక్షకులు. మరి ఈ మారిన బాపుబొమ్మకు అవకాశం ఇచ్చి కరుణించే ఆ దర్శకుడు ఎక్కడున్నాడో..?