ఒక్కోసారి అంతే.. టైమ్ బాగోలేకపోతే తాడే పామైపోతుంది. ఇప్పుడు ప్రదీప్ విషయంలోనూ ఇదే జరిగింది. మనోడు ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లైపోయింది. కానీ ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా బ్యాడ్ ఇమేజ్ తెచ్చుకోలేదు. కానీ బ్యాడ్ టైమ్.. న్యూ ఇయర్ రోజే మనోడికి రాసి పెట్టి ఉంది ఆ బ్యాండ్ బాజా బారాత్. ఎవరికైతే దొరక్కూడదో వాళ్లకే దొరికేసాడు. వాళ్లే మీడియా కళ్లు. డిసెంబర్ 31 రాత్రి అన్న తర్వాత కచ్చితంగా అందరూ తాగుతారు. ఇక్కడ తాగనివాళ్లు చాలా తక్కువే. ప్రదీప్ కూడా ఇదే చేసాడు. కాకపోతే మనోడి టైమ్ బ్యాడ్ అంతే.. పోలీసులకు దొరికిపోయాడు. దాంతో మూడు రోజులుగా మరే వార్తలు లేనట్లుగా ప్రదీప్ నే టార్గెట్ చేస్తూ ఓ టాప్ ఛానెల్ అయితే అదే పనిగా చంపేస్తున్నారు. రేపిస్టులు.. మర్డర్లు చేసిన వాళ్లను ఎలా ప్రొజెక్ట్ చేస్తారో అలా చూపిస్తున్నారు ప్రదీప్ ను. మనోడు కోర్ట్ కు మరేదో కారణం వల్ల రాలేదు దాన్ని కూడా ఓ తప్పులా చూపించారు.
100 మంచి పనులు చేసినా.. ఒక్క చెడ్డపని చాలు ఉన్న పేరు మొత్తం గంగలో కలపడానికి. ఇప్పుడు యాంకర్ ప్రదీప్ విషయంలో ఇదే జరిగింది. మనోడిపై ఇప్పటి వరకు చాలా క్లీన్ ఇమేజ్ ఉంది. మాస్ కాదు.. పక్కా క్లాస్.. చాలా కూల్ గా ఉంటాడు.. ఎవరిపై నోరు పారేసుకోడు.. ఇలా చాలా మంచి ఇమేజ్ ఉండేది. కానీ ఒక్క సీన్ తో అంతా రివర్స్ అయిపోయింది. డ్రంక్ అన్ డ్రైవ్ లో దొరికిపోయేసరికి ప్రదీప్ పై లేనిపోని ఇమేజ్ వచ్చేసింది. అంటే తాగుడు ఆయన చేసిన తప్పు అని ఎవరూ అనట్లేదు. తాగేవాళ్లు చాలా మంది ఉన్నారు కానీ.. ఓ సెలెబ్రెటీ అయ్యుండి కూడా అలా తాగి డ్రైవ్ చేయడం ఎంతవరకు సబబు అంటున్నారు కొందరు. పైగా తాగి డ్రైవ్ చేసి.. ఇతరుల ప్రాణాలు తీయకండి అంటూ అప్పట్లో ఓ యాడ్ లో నీతివాక్యాలు కూడా చెప్పాడు ఈ యాంకర్. ఇప్పుడు ఈయనే ఇలా చేసేసరికి నీతులు చెప్పడానికి మాత్రమే అన్నట్లుంది యవ్వారం. మనోడు ఎలాగోలా ఫైన్ కట్టి బయట పడుతున్నాడో లేదంటే వారం రోజుల పాటు జైలుకు వెళ్తాడో అనేది ఆసక్తికరంగా మారింది. ఇంత బ్యాడ్ టైమ్ లోనూ ప్రదీప్ సుడి ఏంటంటే గజల్ శ్రీనివాస్ ఎపిసోడ్. ఇది మెయిన్ లైన్ లోకి వచ్చి.. మనోడు సైడ్ లోకి వెళ్లిపోయాడు. ఏదంటే ప్రదీప్ పని ఈ పాటికి హరి హరి అయ్యేది