ఏడాది కింది వరకు ఆయన రేంజ్ ఏంటి..? ఇప్పుడు ఆయన ఉన్న పొజిషన్ ఏంటి..? ఎస్.. మనం మాట్లాడుకునేది వినాయక్ గురించే. ఒకే ఒక్క సినిమాతో ఆయన పూర్తిగా సైడ్ అయిపోయాడు. ఇంటిలిజెంట్ తర్వాత ఆయన సినిమాల గురించి ఆలోచించడమే మానేసాడు. పూర్తిగా ఇతరుల సినిమా వేడుకలకు వస్తున్నాడు కానీ తన సినిమా గురించి చెప్పడం లేదు.
ఒకప్పుడు ఈయన ఒక్క ఛాన్స్ ఇస్తే బాగున్ను అని వేచి చూసిన హీరోలు ఇప్పుడు ఈయన కనిపిస్తే ఎలా తప్పించుకోవాలా అని చూస్తున్నారు. ఇంటిలిజెంట్ ఫ్లాప్ తో వినాయక్ రేంజ్ బాగా పడిపోయింది. ఈ చిత్ర ఫైనల్ కలెక్షన్స్ కనీసం 4 కోట్లు కూడా రాకపోవడంతో మనోడి రేంజ్ ఎలా దిగజారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు వినాయక్ నెక్ట్స్ ఏంటి అనే దానిపై అందరి దృష్టి పడింది. అసలు ఈయనకు నిజంగానే సినిమాలు చేసే మూడ్ ఉందా లేదంటే టైమ్ పాస్ కోసం చేస్తున్నాడా అనేది అర్థం కావడం లేదు.
ఈ మధ్య పూర్తిగా సినిమాల గురించి మానేసి.. బయటే కనిపిస్తున్నాడు వినాయక్. అసలు సినిమాలు చేస్తాడా లేదా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. తాజాగా ఈయన 2 స్టేట్స్ సినిమా ఓపెనింగ్ లో కనిపించాడు. అఖిల్, ఇంటిలిజెంట్ లాంటి సినిమాలు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. ఇప్పుడు ఈయన సినిమాలు చేస్తాడా చేయడా అనే అనుమానం కూడా వస్తుందిప్పుడు.
ఇండస్ట్రీలో ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం చూస్తుంటే వినాయక్ ఇప్పట్లో సినిమాలు చేసే మూడ్ లో లేనట్లు తెలుస్తుంది. సాయిధరంతేజ్ సినిమాను కూడా పెద్దగా ఆసక్తి లేకుండానే పూర్తి చేసాడు వినాయక్. ఊహించని విధంగా ఈ చిత్రాన్ని కేవలం 45 రోజల్లోనే తెరకెక్కించాడు. ఇదే సినిమా కొంప ముంచిందేమో అనిపిస్తుంది.
ఆకుల శివ ఇచ్చిందే ప్రసాదంగా ఏవేవో సీన్స్ పెట్టేసాడు వినాయక్. ఇప్పుడు ఈ దర్శకుడి ఇమేజ్ తగ్గించేసింది. నెక్ట్స్ ఏం చేయబోతున్నాడనే అనే ఆసక్తి రెండింతలు చేసింది. మొత్తానికి చూడాలిక.. వినాయక్ తర్వాతి సినిమా ఎలా ఉండబోతుందో.. ఎవరితో ఉండబోతుందో..?