శ్రీరాజన్న మూవిస్. మహెష్ ఎంటర్ ట్రెన్ మెంట్స్ పతాకాలపై రూపొందుతోన్న లవ్ ఎంటర్టైనర్ `పడిపోయా నీ మాయలో`. అరుణ్ గుప్తా, సావేరి, జయవర్ధన్ తారాగణంగా నటించారు. ఆర్.కె.కాంపల్లి దర్శకుడు. మహేష్ పైడ, భరత్ అంకతి నిర్మాతలు. జయవర్ధన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఆర్ధిక శాఖా మంత్రి ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై ఆడియో సీడీలను విడుదల చేశారు. తొలి సీడీని ఎన్.శంకర్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ – “సినిమారంగం కొన్ని కుటుంబాలకే పరిమితమై పోతున్న ఈరోజుల్లో తెలంగాణ యువత సినిమా తీయడానికి ముందుకు రావడం గొప్ప పరిణామం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సినిమా పరిశ్రమ హైదరాబాద్‌లో అంతరించి పోతుందని చాలా మంది అన్నారు. కానీ అవాస్తవమని తెలంగాణ ప్రభుత్వం నిరూపించింది. సినీ పరిశ్రమకు చేయూతనిచ్చింది. ఇప్పుడు చాలా రకాల సినిమాలకు హైదరాబాద్ కేంద్రంగా మారింది. ఒకప్పుడు తెలంగాణ వారికి తపన ఉన్నప్పటికీ అవకాశాలు అరుదుగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. అంతటా ఆదరణ లభిస్తుంది. కరీంనగర్ జిల్లాకు చెందిన వారంతా కలిసి పడిపోయా నీ మాయలో అనే సినిమా తీయడం అభినందనీయం. ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించి అందరికీ మంచి పేరుని తెచ్చిపెట్టాలి“ అన్నారు.
ఎన్.శకంర్ మాట్లాడుతూ “లఘు చిత్రాలు తీసిన దర్శకుడు కాంపల్లి ఓ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా పడిపోయా నీ మాయలో సినిమా చేయడం అభినందనీయం. ఈ సినిమా పెద్ద సక్సెస్‌ను సాధించి యూనిట్‌కు మంచి పేరు తేవాలి“ అన్నారు.
సంగీత దర్శకుడు జయవర్దన్ మాట్లాడుతూ – “నన్ను నమ్మి నాకు మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. మ్యూజిక్కు మంచి స్కోప్ ఉన్న సినిమా ఇది. తప్పకుండా ఎంటర్టైనింగ్ పంథాలో ఉంటుంది“ అన్నారు.
దర్శకుడు అర్.కె.కాంపల్లి మాట్లాడుతూ – “మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ఈటెల రాజేందర్‌గారికి కృతజ్ఞతలు. ముందుగా ఈ సినిమాకు మేం అనుకున్న టైటిల్ వేరు. కానీ కథానుగుణంగా ఈ టైటిల్ అయితే యాప్ట్ అవుతుందని భావించి `పడిపోయా నీ మాయలో` అనే టైటిల్‌ను నిర్ణయించాం. నిర్మాత భరత్‌గారు నాకు పదేళ్లుగా పరిచయం. నేను చెప్పిన సింగిల్ లైన్ నచ్చిన ఆయన సినిమా చేయమని అన్నారు. తర్వాత మహేష్‌గారు మాతో జత కలిశారు. అరుణ్, సావేరి చక్కగా నటించారు. ఇక విక్రమ్ తలశిలగారు నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. నాకు పూరిగారంటే పిచ్చి. ఆయన్ను దృష్టిలో ఉంచుకునే ఈ సినిమాను డిజైన్ చేసుకున్నాను. ఆయనలా సినిమా తీయాలనేది నా కల. ఇదే బ్యానర్లో నా రెండో సినిమా కూడా చేస్తాను. సినిమా బాగా వచ్చిందని చూసిన వారందరూ అంటున్నారు. త్వరలోనే సినిమా మీ ముందుకు తీసుకొస్తాం“ అన్నారు.
నిర్మాతలు మహేష్ పైడ, భరత్ అంకతి మాట్లాడుతూ – “దర్శకుడు ఆర్.కె.గారు చెప్పిన కథ బాగా నచ్చింది. ఆయన చెప్పిన తీరు బాగా నచ్చడంతో సినిమా చేయడానికి ముందుకు వచ్చాం. ఆర్.కెగారి టాలెంట్‌ను నేను గమనించాం. సినిమా పూర్తయ్యింది. వినోదాత్మక ప్రేమకథా చిత్రం. వరంగల్, ఖమ్మం, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో సినిమాను చిత్రీకరించాం. అరుణ్, సావేరి చక్కగా నటించారు. ఫణి, రాధాకృష్ణ, మల్లిఖార్జున సహా అందరూ బాగా సపోర్ట్ చేయడంతో సినిమాను చక్కగా పూర్తి చేశాం“ అన్నారు.
ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ, ప్రతాని రామకృష్ణా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఫణిదర్, రాధకృష్ణ,భరత్ అంకతి,మల్లికార్జున్,రాధరపుప్రభాకర్,పుర్ణచందర్, మల్లేషం, శివ, ఆశ్విని,నేహ,మహేష్ పైడ,వేణు నాగుల,చంద్రశేఖర్,రమేష్ అరె తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతంః జయవర్ధన్, పాటలరచయితలుః నరేష్ చైతన్య,వీరు, గాయకులుః గీతమాదురి, మాలవిక,హైమద్,జయవర్దన్, డి.ఓ.పి…విక్రమ్ తలశిల, ఫెట్స్ః రాజు మద్దురి, ఎడిటర్ః గోపి సిందం, నిర్మాతలు…మహెష్ పైడ,భరత్ అంకతి, కథ,మాటలు,స్రీన్ ప్లె,దర్శకత్వం…..ఆర్ కె కాంపల్లి.