పవన్ కళ్యాణ్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి కానీ ఆయన కానీ హిట్ కొడితే బాక్సాఫీస్ బద్ధలైపోవడం ఖాయం. ఫ్లాప్ సినిమాలతోనే ఇప్పటికీ రికార్డుల వేట సాగిస్తున్నాడు పవర్ స్టార్. ఈయన డిజాస్టర్ సినిమా అజ్ఞాతవాసి రికార్డులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి.
ఫస్ట్ డే రికార్డుల్లో ఎవరూ ఆయన దరికి కూడా చేరుకోలేకపోతున్నారు. ఇండియా.. ఓవర్సీస్ లో పవన్ రికార్డులు కదలడం లేదు. రంగస్థలం వచ్చినా.. ఇప్పుడు భరత్ వచ్చినా కూడా అజ్ఞాతవాసి మాత్రం అలాగే ఉన్నాడు. భరత్ అనే నేను తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో 22 కోట్లు.. కర్ణాటక, తమిళనాడు, రెస్టాఫ్ ఇండియా కలిపి మరో 4 కోట్లు.. ఓవర్సీస్ లో 6 కోట్ల షేర్ అందుకుంది.
మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజే 32 కోట్ల షేర్ సాధించింది. అజ్ఞాతవాసి తొలిరోజే 39 కోట్ల షేర్ వసూలు చేసింది. ఓవర్సీస్ లో 1.6 మిలియన్ డాలర్స్ అంటే దాదాపు 8 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇప్పుడు భరత్ 1.4 మిలియన్ అంటే 6 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. మొత్తానికి భరత్ అనే నేను కూడా పవన్ ను కదిలించలేకపోయాడు. అయితే టాక్ బాగుంది కాబట్టి కలెక్షన్లు అద్భుతంగా వస్తున్నాయి.