పండగ వచ్చినా.. పబ్బమొచ్చినా.. తమ అభిమాన హీరోల సినిమాల నుంచి ఏదైనా కొత్త లుక్ ఊహిస్తారు. ప్రతీ హీరో ఇలాగే చేస్తుంటాడు. మహేశ్ ఈ లిస్ట్ లో అందరికంటే ముందుంటాడు. ప్రతీ వెకేషన్ కు ఈయన తన సినిమా ముచ్చట్లు చెబుతుంటాడు సూపర్ స్టార్. ఇప్పుడు కూడా ఇదే చేయనున్నాడు. ఈయన ప్రస్తుతం భరత్ అనేనేను సినిమాలో నటిస్తున్నాడు. ఆ మధ్య యాడ్ షూట్ కోసం అమెరికా వెళ్లిన మహేశ్.. గత వారం రోజులుగా హైదరాబాద్ లోనే ఉన్నాడు. నవంబర్ 30 నుంచి ఈ చిత్ర కొత్త షెడ్యూల్ మొదలైంది. డిసెంబర్ 7 వరకు హైదరాబాద్ లోనే భరత్ అనే నేను షూటింగ్ జరగనుంది. మహేశ్ తో పాటు కైరాఅద్వాని కూడా షూటింగ్ లో పాల్గొంటుంది. అంతేకాదు.. తర్వాతి షెడ్యూల్ ను కూడా ఖాయం చేసాడు దర్శకుడు కొరటాల.
డిసెంబర్ 7న హైదరాబాద్ షెడ్యూల్ ముగిసిన తర్వాత 10 నుంచి తమిళనాడు వెళ్లనుంది చిత్రయూనిట్. అక్కడే డిసెంబర్ 10 నుంచి కారైకూడిలో రెండు వారాల పాటు భారీ షెడ్యూల్ జరగనుంది. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తైపోయినట్లే. ఎట్టి పరిస్థితుల్లోనూ భరత్ అనే నేను షూటింగ్ ను ఫిబ్రవరిలోపు పూర్తి చేయాలనేది కొరటాల ప్లాన్. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను డిసెంబర్ 31 రాత్రి విడుదల చేయాలని చూస్తున్నారు చిత్రయూనిట్. సరిగ్గా ఏడాది కింద జనవరి 1న బ్రహ్మోత్సవం టీజర్ విడుదల చేసాడు మహేశ్. ఇప్పుడు భరత్ అనేనేను కు అదే సీన్ రిపీట్ చేస్తు న్నాడు. మొత్తానికి ఈ సారి జనవరి 1 మహేశ్ అభిమానులకు పండగే. భరత్ అనేనేనులో ముఖ్యమంత్రిగా నటిస్తున్నాడు మహేశ్. మరి ఆ లుక్ ఎలా ఉండబోతుందో..?