అసలే ఇప్పుడు సాయిధరంతేజ్ కెరీర్ ఎటూ కాకుండా ఉంది. కానీ ఈయనకు ఆఫర్లు మాత్రం బాగానే వస్తున్నాయి. ప్రస్తుతం కరుణాకరణ్ తెరకెక్కించిన తేజ్ ఐ లవ్ యూ విడుదల కోసం చూస్తున్నాడు సాయి. ఈ చిత్రం జూన్ 29న రావాల్సింది.. కానీ ఇప్పుడు జులై 6కి వెళ్లిపోయింది. ఇక ఈ చిత్రం విడుదలకు ముందే మరో సినిమా మొదలుపెట్టబోతున్నాడు సాయి. అది కూడా సెన్సిబుల్ డైరెక్టర్ కిషోర్ తిరుమలతో.
నేను శైలజ.. ఉన్నది ఒకటే జిందగీ లాంటి సినిమాలతో ఈయన బాగానే పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు సాయిధరంతేజ్ తో మరో లవ్ స్టోరీ చేయబోతున్నాడు ఈ దర్శకుడు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో హీరోయిన్ గా ముందు అనుపమ పరమేశ్వరన్ ను అనుకున్నారు. కానీ ఇప్పుడు సడన్ గా సీన్ లోకి రితికా సింగ్ వచ్చింది. గురు సినిమాలో ఏంది గురూ అంటూ పక్కా మాస్ గా నటించిన ఈ భామ.. ఇప్పుడు లవ్ స్టోరీకి సరిపోతుందా అనే డౌట్స్ వస్తున్నాయి అందరిలోనూ. పాప మరీ మాస్ గా ఉంటుంది.. అసలు సాయిధరంతేజ్ కు సరిపోతుందా..
ఈ జోడి ఎలా ఉంటుందో అనే ఆలోచనలు ఇప్పట్నుంచే మొదలయ్యాయి. రితికా ఎందుకో కరెక్ట్ కాదనే టాక్ కూడా వస్తుంది ప్రేక్షకుల్లో. మరి కిషోర్ వరకు ఈ టాక్ వెళ్తుందో లేదో చూడాలి. ఏదేమైనా గురు తర్వాత ఇప్పటి వరకు రితికా సింగ్ తెలుగులో పెద్దగా నటించింది లేదు.