బాపురే.. మ‌హాన‌టి డిజిట‌ల్ 18 కోట్లా..?


ఏదో జ‌రుగుతుంది.. ఇప్పుడు మ‌హాన‌టి దెబ్బ‌కు రికార్డులన్నీ క‌దులుతున్నాయి. చిన్న సినిమాగా మొద‌లై.. ఇది వెళ్తోన్న తీరుకు అంతా షాక్ అయిపోతున్నారు. అస‌లు విడుద‌ల‌కు ముందు ఈ స్థాయిలో మ‌హాన‌టి క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తుంద‌ని టీం కూడా ఊహించి ఉండ‌దు.
కానీ ఇప్పుడు అదే జ‌రుగుతుంది. థియెట్రిక‌ల్ క‌లెక్ష‌న్లు ప‌క్క‌న‌బెడితే కేవ‌లం రైట్స్ రూపంలోనే అశ్వినీద‌త్ పంట పండుతుంది. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ 11 కోట్ల‌కు పైగా అమ్ముడ‌య్యాయి. జీ నెట్ వ‌ర్క్ ఈ హ‌క్కుల్ని తీసుకుంది. ఇక ఇప్పుడు డిజిట‌ల్ రైట్స్ అయితే ఏకంగా 18 కోట్ల‌కు వెళ్లిన‌ట్లుగా తెలుస్తుంది. ఇదే నిజ‌మైతే మాత్రం క‌చ్చితంగా ఇది ఓ రికార్డే. పెద్ద సినిమాల‌కు సైతం సాధ్యం కాని రికార్డ్ ను మ‌హాన‌టి సొంతం చేసుకున్న‌ట్లే.
అయితే ఒక్క భాష‌కు కాదు.. తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాల భాషల్లో క‌లిపి 18 కోట్ల‌కు ఈ చిత్ర హ‌క్కులు అమ్ముడైపోయిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. మొత్తానికి చాలా ఏళ్‌ళ త‌ర్వాత మ‌ళ్లీ వైజ‌యంతిలో జ‌యం క‌నిపించి.. సంబ‌రాలు జ‌రుగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here