సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఏదీ పర్సనల్ కావడం లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు ఆడేసుకుంటున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ 2 పరిస్థితి కూడా అంతే. తొలిరోజు డిజాస్టర్ టాక్ తోనే ఓపెన్ అయినా.. ఉన్నంతలో ప్రస్తుతానికి బాగానే వెళ్తుంది ఈ సీజన్. అంతా తెలియని మొహాలే ఎక్కువ ఉండటంతో ఆసక్తి తగ్గిన మాట వాస్తవమే కానీ రోజుకో గేమ్ తో.. ఊహించని పరిణామాలతో బాగానే వెళ్తుంది బిగ్ బాస్.
అయితే ఇందులో ఉన్నోళ్లపై ట్రోలింగ్ మాత్రం మామూలుగా లేదు. ముఖ్యంగా అందరిలోనూ బాబు గోగినేని రెబల్ గా ఉన్నాడు. ఆయన ఏం చేసినా బిగ్ బాస్ కు ఆపోజిట్ గానే చేస్తున్నాడు. అంతా నా యిష్టం.. బిగ్ బాస్ ఎవరు మధ్యలో అంటూ రచ్చ చేస్తున్నాడు. ఈయనపై ట్రోలింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇక దీప్తి సునైన, సంజన ఆన్నెపై కూడా ట్రోలింగ్స్ బాగానే వస్తున్నాయి. బ్రహ్మోత్సవం.. బాద్షా.. ఉయ్యాలా జంపాలా లాంటి సినిమాల్లోని సీన్స్ తీసుకుని బిగ్ బాస్ 2 కు సరిపోయేట్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఇవి ప్రేక్షకులను బాగానే నవ్విస్తున్నాయి. వాటిని ఒక్కసారి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.