ఓ బ్రాండ్ తో సినిమా విడుదలైనపుడు కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రాకుండా ఉండవు. కానీ బ్రాండ్ బాబు విషయంలో మాత్రం ఇది జరిగింది. మారుతి బ్రాండ్ తో మొదలైన ఈ సినిమాకు ఇప్పుడు ఘోరమైన అవమానం జరిగింది. కనీసం పోస్టర్ ఖర్చులు కాదు.. విడుదల డబ్బులు కూడా రావేమో..? ఫుల్ రన్ లో కనీసం 50 లక్షల షేర్ తీసుకురాలేదు ఈ సినిమా. ఇప్పటికే చాలా చోట్ల క్లోజ్ అయిపోయింది ఈ చిత్ర ప్రయాణం. మరోవైపు బడ్జెట్ చూస్తే దాదాపు 8 కోట్లకు పైగానే పెట్టినట్లు తెలుస్తుంది. మారుతి బ్రాండ్ చెప్పి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
కానీ పూర్తిగా మిస్ ఫైర్ కావడమే కాదు.. ఎందుకు ఇలాంటి సినిమాలకు మారుతి కథలు అందిస్తున్నాడు అంటూ రివర్స్ లో ఆయనపైనే సెటైర్లు పడుతున్నాయి. ఓవర్సీస్ లో ఈ సినిమా చూడ్డానికి ఒక్క ప్రేక్షకుడు మాత్రమే థియేటర్ కు వచ్చాడు. అక్కడ కేవలం 10 డాలర్లు మాత్రమే వసూలు చేసింది ఈ చిత్రం. ఇప్పటికైనా తన బ్రాండ్ వ్యాల్యూ తెలుసుకుని మారుతి ఇలాంటి కథలు రాయకుండా ఉంటే మంచిదంటున్నారు ఆయన్ని అభిమానించే వాళ్లు. మరి దీన్ని మారుతి సీరియస్ గా తీసుకుంటాడో లేదో..?