భరత్ అనే నేనుకు అతిపెద్ద గండం గడిచిపోయింది. ఈ చిత్రం సెన్సార్ అయిపోయింది.. యు బై ఏ ఇవ్వడమే కాకుండా ఒక్క కట్ కూడా చెప్పలేదు సెన్సార్ బోర్డ్. సినిమా కాస్త ఎక్కువ నిడివితోనే వస్తుంది. షో అయిన తర్వాత సెన్సార్ సభ్యులంతా చిత్రయూనిట్ ను ప్రత్యేకంగా అభినందించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుత రాజకీయాలను స్పృషిస్తూనే..
రాజకీయ నాయకులు అంటే ఎలా ఉండాలో ఈ సినిమాలో చూపిస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ. ముఖ్యమంత్రి అనేవాడు ఎలా ఉంటే రాష్ట్రం బాగు పడుతుందో.. ప్రజలకు ఎలాంటి పనులు చేస్తే బాగుంటుందో ఇందులో చూపించాడు ఈ దర్శకుడు. అప్పుడు శ్రీమంతుడు టైమ్ లో ఈయన చేసిన గ్రామదత్తత కాన్సెప్ట్ జనాల్లోకి బాగానే వెళ్లింది.
ఇప్పుడు కూడా సినిమాలో పల్లెలే దేశానికి పట్టుసీమలు అనే కాన్సెప్ట్ తో వస్తున్నాడు కొరటాల. సినిమాలో ఒక్క కట్ కూడా లేకుండా.. క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. కైరా అద్వాని గ్లామర్ షోకు తోడు సెకండాఫ్ లో వచ్చే కొన్ని యాక్షన్ సీక్వెన్సులతో సినిమాకు యు కు తోడుగా ఏ కూడా ఇచ్చారు. మొత్తానికి భరత్ అనే నేను సెన్సార్ టాక్ అయితే అదిరిపోయింది. బొమ్మ బ్లాక్ బస్టర్ అని వాళ్లు తేల్చేసారు. మరి రేపు సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులు ఏం చెప్తారో చూడాలిక..! ఎప్రిల్ 20న 2000 థియేటర్స్ లో విడుదల కానుంది ఈ చిత్రం.