బి.జె.పి ఎం.పి మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసి కొత్త వివాదానికి తెర తీశారు. దీపికా పాడుకొనే ముఖ్య పాత్రలో సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావతి’ చిత్రంలో చరిత్రను వక్రీకరించారని, బ్యాన్ చేయాలనీ కొందరు బీజేపీ నేతలు డిమాండ్ చేసారు. ఈ క్రమంలో రాజస్థాన్ బి.జె.పి ఎం.పి. చింతామణి మలివ్య సినిమా వాళ్ళ భార్యలు భర్తలను ప్రతి రోజు మారుస్తుంటారని, అలంటి వారికి ‘జవహర్’ గురించి ఏమి తెలుస్తుందని, ఇటువంటి దుష్ట మనస్తత్వాలు కలిగిని చిత్రసీమ వారిని చెప్పులతో కొట్టాలని చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపాయి. ఈ విషయంపై ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తీవ్ర స్థాయి లో స్పందించారు. “బీజేపీ ఎంపి చేసిన వ్యాఖ్యలను చిత్ర సీమ వారందరు ఏక ధాటిగా ముక్త కంఠం తో ఖండించాల్సిన అవసరముందని. బీజేపీ వారు మహిళలను గౌరవిస్తాము, తల్లులగా చూసుకుంటాము అంటారు. మరి వారి ఎం.పి. మహిళలను ఇంత నీచంగా అవమానించడం ఏమిటని ప్రశ్నించారు. చిత్ర సీమ వారే కాదు సామాన్య ప్రజానీకం కూడా ఎం.పి. చేసిన వ్యాఖ్యలకు స్పందించాలని కోరుకుంటున్నాను. నాకు చాల భాద కలగటమే కాదు, ఏదోకటి చేసెయ్యాలనేంత కోపం గా ఉంది ,” అన్నారు తమ్మారెడ్డి.