మెల్ల‌గా స‌మ్మోహ‌న‌ప‌రుస్తుంది.

Sammohanam

రెండేళ్ల కింది వ‌ర‌కు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ సినిమాలు అంటే కేవ‌లం ప్ర‌శంస‌ల వ‌ర‌కే ప‌రిమితం అనుకునే వాళ్లు. దానికి త‌గ్గ‌ట్లే అప్ప‌ట్లో ఆయ‌న సినిమాలు కూడా అలాగే ఉండేవి. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఈయ‌న సినిమాలు క‌మ‌ర్షియ‌ల్ గానూ దుమ్ము దులిపేస్తున్నాయి.

వ‌ర‌స విజ‌యాల‌తో ర‌చ్చ చేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇప్పుడు స‌మ్మోహ‌నం కూడా ఇదే కోవ‌లోకి వ‌స్తుంది. ఈ చిత్రం కూడా ఇప్పుడు క‌మ‌ర్షియ‌ల్ గా మంచి విజ‌యం వైపు అడుగేస్తుంది. ఇప్ప‌టికే నాలుగు రోజుల్లో 4.50 కోట్ల షేర్ తీసుకొచ్చింది స‌మ్మోహ‌నం. సుధీర్ బాబు రేంజ్ కు ఇది ఎక్కువే. ఈయ‌న గ‌త సినిమాల‌కు ఓపెనింగ్స్ ఇంకా వీక్ గా ఉండేవి. కానీ ఇప్పుడు స‌మ్మోహ‌నం మెల్ల‌గా అంద‌ర్నీ స‌మ్మోహ‌న‌ప‌రుస్తుంది.

అదితి రావ్ హైద్రీ హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రాన్ని శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మించారు. వీక్ డేస్ కూడా వ‌సూళ్లు బాగానే వ‌స్తున్నాయి. మ‌రో రెండు వారాలు చెప్పుకోద‌గ్గ సినిమాలేవీ లేక‌పోవ‌డంతో స‌మ్మోహ‌నం మ‌రింత ముందుకు వెళ్తుంద‌ని ఆశిస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మ‌రి వాళ్ల కోరిక‌ను ఈ చిత్రం ఎంత‌వ‌ర‌కు నెర‌వేరుస్తుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here