మూడు జెనరేషన్స్ మద్య ప్రేమ ఆప్యాయతల్ని చక్కగా తెరకెక్కించిన చిత్రం `ప్రేమతో మీ కార్తీక్`. రిషి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ రవీందర్ ఆర్.గుమ్మకొండ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాతో కార్తికేయ, సిమ్రాత్ లు హీరోహీరోయిన్స్ గా పరిచయం అవుతున్నారు. షాన్ రెహమాన్ అందించిన ఆడియో అండ్ వీడియో సాంగ్ ని సక్సస్‌ఫుల్ నిర్మాత దిల్ రాజు గారి చేతుల మీదుగా విడుదల కావటమే కాకుండా దిల్‌రాజు గారి ద్వారా ఈ చిత్రం విడుదల నవంబర్ 17న విడుదల కానుంది. రీసెంట్ గా విడుదల చేసిన ధియెట్రికల్ ట్రైలర్ ప్రేక్షకుల హ్రుదయాల్ని విపరీతంగా ఆకట్టుకోవటం విశేషం. ఇదిలా వుంటే సాయిప్రకాష్ ఉమ్మడిసింగ్ అందించిన సినిమాటోగ్రఫి విజవల్ గా గ్రాండియర్ గా వుండటంతో ఇంతలా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ చిత్రానికి సంభందించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి నవంబర్ 17న విడుదల చేయనున్నారు.
దర్శకుడు రిషి మాట్లాడుతూ – “ మెస్ట్ సక్సస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు గారు చేతుల మీదుగా మా చిత్రం విడుదల కావటం మా అదృష్టం గా భావిస్తున్నాను. ఇటీవల విడుదల చేసిన ధియెట్రికల్ ట్రైలర్ కి చాలా మంచి రెస్పాన్స్ రావటం మా యూనిట్ అందరికి ఎనర్జి వచ్చింది. మా చిత్రం మంచి ఫీల్ గుడ్ ఫ్యామిలి ఎంటర్‌టైనర్ గా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. ఊరు వదిలి విదేశాలు వెల్లిన ఓ కొడుకు తను కొల్పోయిన జీవితాన్ని తన కొడుకుకి ఇవ్వాలని చేసిన ప్రయత్నంమా చిత్ర మూలకథ. సీనియర్ నటులు గొల్లపూడి మారుతిరావు గారు, మురళి శర్మ గారు చాలా మంచి పాత్రల్లో నటించారు. మా చిత్రానికి సంభందించిన ట్రైలర్ ని త్వరలో విడుదల చేస్తాము. చిత్రాన్ని నవంబర్ 17న విడుదల చేస్తాము.. అని అన్నారు
నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మడికొండ మాట్లాడుతూ.. ప్రేమతో మీ కార్తిక్ చిత్రానికి సంభందించిన ట్రైలర్ ని విడుదల చేశాము. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మా అన్నయ్య గారి అబ్బాయ్ కార్తిక్ హీరో గా చేస్తున్నాడు. మాకు అన్నివిధాల సహకరిస్తున్న మీడియా వారికి మా ధన్యవాదాలు. ఈ చిత్రాన్ని సక్సస్‌ఫుల్ నిర్మాత దిల్‌రాజు గారు ఆద్వర్యంలో ఈ చిత్రం నవంబర్ 17న విడుదల కానుంది. అని అన్నారు
కార్తికేయ,సిమ్రత్, గొల్లపూడి మారుతీరావు, సుమిత్ర, మురళీశర్మ, పృథ్వీ, ప్రగతి, ఝాన్సీ, దువ్వాసి, కారుమంచి రఘు తదితరులు నటించిన ఈ చిత్రానికి
సాహిత్యంః శ్రీమణి, ఎడిటర్ః మధు, ఆర్ట్ః హరివర్మ, సినిమాటోగ్రఫీః సాయిప్రకాష్ ఉమ్మడిసింగు, సంగీతంః షాన్ రెహమాన్, లైన్ ప్రొడ్యూసర్ః అశోక్‌రెడ్డి గుమ్మడికొండ, నిర్మాతః రవీందర్ ఆర్.గుమ్మడికొండ, రచన, దర్శకత్వంః రిషి.