తెలుగు సినిమా చరిత్రను శివ ముందు, శివ తర్వాత అనేంత స్థాయి విజయం తో సంచలనం సృష్టించిన అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ మళ్ళి ఏకమయ్యారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియో లో ప్రారంభమయ్యింది.
రామ్ గోపాల్ వర్మ తల్లి ఫస్ట్ క్లాప్ ను ఇచ్చారు. కార్యక్రమంలో మాట్లాడుతూ… వర్మ “నేను దేవుడిని నమ్మను కానీ నాగార్జునను నమ్ముతాను. నాకు మైండ్ దొబ్బింది జ్యూస్ అయిపొయింది అని చాలా మంది అంటున్నారు, అవును మైండ్ దొబ్బింది కానీ జ్యూస్ అయిపోయిందా లేదా అని ఈ మూవీ తర్వాత చూస్తారు,” అని అన్నారు.
నాగార్జున మాట్లాడుతూ,”నాకు తన మీద నమ్మకం, నా మీద తనకు నమ్మకం. 28 ఏళ్లకు మెచూరిటీ వస్తుందని నాన్నగారు అనేవారు, నాకు 28 ఏళ్ళకు శివ చేశాను. మళ్ళి ఇప్పుడు 28 ఏళ్ళ తర్వాత డబల్ మెచూరిటీతో ఇప్పుడు మళ్ళి కలిసి చేస్తున్నాము. ఆర్.జి.వి కుటుంబంతో మాకు చాలా అనుబంధం ఉంది. అయన పెద్దమ్మ ఝాన్సీ గారు నాకు మూడేళ్లు ఉన్నపటినుండి ఎత్తుకుని ఆడించారు,” అని చెప్పారు. ఈ కార్యక్రమానికి జె డి చక్రవర్తి, పూరి జగన్నాధ్, ఉత్తేజ్ తదితరులు హాజరయ్యారు.