దేవదాసు అంటే ముందు మన కళ్లముందు కనిపించేది నాగేశ్వరరావ్. ఆయన్ని తప్ప ఆ పాత్రలో మరో హీరోను ఊహించుకోవడం కష్టమే. అయితే ఇప్పుడు ఈ టైటిల్ తోనే నవ్వించడానికి వస్తున్నాడు నాగార్జున. ఈయనతో పాటు నాని కూడా వస్తున్నాడు. ఈ ఇద్దరూ ప్రస్తుతం దేవదాసులో కలిసి నటిస్తున్నారు. ఈ మల్టీస్టారర్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ముఖ్యంగా శ్రీరామ్ ఆదిత్య తొలి రెండు సినిమాలు భలే మంచి రోజు.. శమంతకమణి ల్లో కామెడీ హైలైట్ గా ఉంటుంది.
ఇప్పుడు ఈ చిత్రంలోనూ ఇదే ఉంటుందంటున్నాడు నాగార్జున. కడుపులు చెక్కలయ్యే కామెడీతో అందర్నీ ఆకట్టు కుంటుందని చెప్పాడు నాగ్. మరో 10 రోజుల్లో ఈ చిత్ర షూటింగ్ పూర్తైపోతుందని.. అన్నీ కుదిర్తే సెప్టెంబర్ లోనే సినిమా విడుదల కావడం ఖాయం అంటున్నాడు నాగార్జున. నానితో నటించడం హ్యాపీగా ఉందని.. దేవదాసు కచ్చితంగా పేరు నిలబెట్టేలాగే ఉంటుందని హామీ ఇస్తున్నాడు నాగార్జున. మరి ఈయన నమ్మకాన్ని ఈ చిత్రం ఎంతవరకు నిలబెడుతుందో చూడాలిక..!