ఎవడండీ తెలుగు సినిమా తక్కువ అన్నది.. ఇండియాలో బాలీవుడ్ నెంబర్ వన్ అన్నది.. ఇప్పుడు చెప్పమనండి ఆ మాట. మన సినిమాలు కూడా ఇప్పుడు దూకుడు చూపిస్తున్నాయి. ఇండియన్ సినిమాపై ఎగురుతున్న జెండా మన సినిమాదే. మన రాజమౌళి చేసిందే.. బాహుబలి.
ఆ సినిమా ఏకంగా 2300 కోట్లకు పైగా వసూలు చేసి.. తెలుగు సినిమా సత్తా బాలీవుడ్ కు చాటి చెప్పింది. ఇక ఇప్పుడు బడ్జెట్ విషయంలో కూడా మన నిర్మాతలు చేస్తోన్న సాహసం బాలీవుడ్ లో చేయడం లేదు. ఇండియన్ హైయ్యస్ట్ బడ్జెట్ మూవీ 2.0 తెరకెక్కుతుంది మన సౌత్ లోనే.
ఈ చిత్రం కోసం ఏకంగా 450 కోట్లు పెట్టిస్తున్నాడు శంకర్. ఇక బాహుబలి రెండు భాగాల కోసం దాదాపు 350 కోట్లు పెట్టారు. ఇక ఇప్పుడు రాజమౌళి తన మల్టీస్టారర్ సినిమా కోసం ఏకంగా 300 కోట్లు పెట్టిస్తున్నాడు.
ఈ మాట చెప్పింది ఎవరోకాదు.. స్వయంగా ఆ చిత్ర నిర్మాత డివివి దానయ్య.
ఈ మల్టీస్టారర్ కోసం భారీ బడ్జెట్ పెడుతున్నాం.. అది 300 కోట్ల వరకు ఉంటుందని చెప్పాడు దానయ్య. ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా జక్కన్న తెరకెక్కించబోయే ఈ చిత్రం అక్టోబర్ నుంచి మొదలు కానుంది. అక్కడ మరో దర్శకుడైతే నిర్మాత ఆలోచనలో పడేవాడేమో కానీ అడుగుతున్నది రాజమౌళి.
300 కోట్లు పెడితే 500 వస్తాయని అతడి నమ్మకం. అందుకే మరో మాట లేకుండా డివివి దానయ్య కూడా బడ్జెట్ ఇచ్చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని కూడా విజువల్ వండర్ గానే రాజమౌళి తెరకెక్కించబోతున్నాడు. బాహుబలి రేంజ్ లో కాదు కానీ ఈగ స్థాయిలో ఈ చిత్రంలో గ్రాఫిక్స్ వాడుకుంటున్నాడు రాజమౌళి. ఇందులో ఎన్టీఆర్ కారెక్టర్ కాస్త నెగిటివ్ టచ్ లో సాగుతుందని తెలుస్తుంది. మొత్తానికి ఈ చిత్రం ముందుగా చెప్పినట్లు 2019లో రాదు కానీ విజన్ 2020లోనే రాజమౌళి విజన్ ఏంటనేది తెలియ బోతుంది