సావిత్రి జీవితం అంటే ప్రతీ తెలుగు వాడి సొత్తు.. సొంతం. ఆమె అందరికీ నటి అయ్యుండొచ్చు కానీ తెలుగు వాళ్లకు మాత్రం ఆడపడుచు. ప్రతీ ఇంటి కూతురు.. ప్రతీ ఇంటి బిడ్డ. అలాంటి ఆమె బయోపిక్ అంటే కచ్చితంగా ఉండే అంచనాలు వేరు. సావిత్రి జీవితం అంటే ఆమె ఒక్కరే కాదు..
చుట్టూ చాలా మంది ఉండాల్సిందే. వాళ్లు లేకుండా సావిత్రి జీవితం పూర్తి కాదు. అందులో ముఖ్యంగా ఎన్టీఆర్, ఏఎన్నార్ కీలకం. 50ల్లో వీళ్లు నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లే. మహానటిలో వీళ్ల పాత్రలు కూడా కీలకమే. నాగేశ్వరరావ్ గా ఆయన మనవడు నాగచైతన్య నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ విషయంపై కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. కానీ ఇందులో ఎన్టీఆర్ గా ఎవరు నటిస్తున్నారనే విషయంపై మాత్రం నో క్లారిటీ. జూనియర్ ఎన్టీఆర్ ను అడిగినా ఆయన ఒప్పుకోలేదు..
ఈ విషయం స్వయంగా ఆయనే చెప్పాడు. దాంతో ఈ చిత్రంలో ఎన్టీఆర్ గా డిజిటల్ రూట్ ఫాలో అయ్యారు. అంటే యమదొంగలో రాజమౌళి చేసినట్లుగా ఇక్కడ కూడా ఎన్టీఆర్ ను అలాగే స్క్రీన్ పై ప్రజెంట్ చేస్తున్నారు. రేపు సినిమాలో పెద్దాయన అభిమానులకు ఇది స్పెషల్ ట్రీట్ గా మిగిలిపోతుందని భావిస్తున్నారు చిత్రయూనిట్. మొత్తానికి అందరికీ అందరూ సెట్ అయినా.. మహానటుడి పాత్రకు మాత్రం ఎవరూ సెట్ కాలేదన్నమాట.