ఈ మధ్య కాలంలో మళ్లీ మూడు గంటల సినిమాలకు బాగా అలవాటు పడిపోయారు ప్రేక్షకులు.. వాళ్లు చూస్తున్నారు కదా అని దర్శక నిర్మాతలు కూడా. ఒకప్పుడు రెండు గంటల్లో తేల్చేసి అవతల పడేసే దర్శకులు ఇప్పుడు నీట్ గా.. క్లీన్ గా చెప్పాలనుకున్నది మూడు గంటల్లో చెప్తున్నారు. ఈ మధ్య అర్జున్ రెడ్డి.. రంగస్థలం..
భరత్ అనే నేను.. నా పేరు సూర్య ఇవన్నీ మూడు గంటలకు చేరువగా వచ్చినవి.. దాటినవే. ఇప్పుడు మహానటి కూడా ఈ లిస్ట్ లోకి చేరిపోయింది. ఈ చిత్రం కూడా మూడు గంటల నిడివితో వస్తుంది. 2 గంటల 57 నిమిషాల రన్ టైమ్ తో మహానటి విడుదలకు సిద్ధమైంది. భారీ అంచనాల మధ్య మే 9న విడుదలవుతుంది ఈ చిత్రం. ఓవర్సీస్ ప్లస్ ఇండియాలో కలిపి దాదాపు 1000 థియేటర్స్ లో వస్తుంది మహానటి.
తెలుగుతో పాటు తమిళ, మళయాల భాషల్లోనూ విడుదల కానుంది ఈ చిత్రం. అన్ని భాషల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. సావిత్రి జీవితం కావడంతో అంతా ఏం జరిగింది అని తెలుసుకోడానికి చూస్తున్నారు. ఇక ఈ చిత్రంలో కీర్తిసురేష్ నటన ఇప్పటికే చర్చనీయాంశం అయిపోయింది. నిజంగానే సావిత్రి మళ్లీ బతికి వచ్చిందా అన్నట్లుగా ఇందులో మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. సమంత, దుల్కర్ సల్మాన్, మోహన్ బాబు లాంటి క్యాస్టింగ్ కూడా సినిమాపై అంచనాలు పెంచేసింది. మరి చూడాలిక.. ఈ మూడు గంటల సినిమాతో మహానటి ఏం చేయబో తుందో..?