ఇటీవల హిందూ యూనివర్సిటీ లో జరిగిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ పరీక్షలో వివాదాస్పదంగా ప్రశ్నలు ఉన్నాయ్ అని విద్యార్థులు వ్యక్తం చేసారు. అందులోను హిస్టరీ పేపర్ లో వివాదాస్పద ప్రశ్నలు అనగా పద్మావతి అల్లాఉద్దీన్ ఖిల్జీ తదితర అంశాల గురించి లేవనెత్తారట. అదే కాకుండా ముస్లిం మతాన్నికి సంభందించిన హలాల్, హిందూ ముస్లిం ఐక్యతకు సాధువుల పాత్ర గురించి మరియు ముస్లిం మతం లో సామజిక సమస్యలను గురించి అడిగారట. ప్రస్తుతం జరుగుతున్నవివాదాస్పద అంశాలు దృష్టిలో పెట్టుకొని ప్రశ్న పత్రం రాసినట్టు తెలుస్తుంది. కానీ విద్యార్థులు మాత్రం ఇలాంటి ప్రశ్నలు అడిగినందుకు అభ్యంతరం వ్యక్తం చేసినా, యూనివర్సిటీ మాత్రం ఇలాంటి ప్రశ్నలు రావడం సహజం అని అన్నారు.