ఏ ఎండకు ఆ గొడుగు.. ఈ సామెత అందరికీ తెలిసే ఉంటుంది. దీన్నే ఇంగ్లీష్ లో స్టైల్ గా రోమ్ లో ఉన్నపుడు రోమన్ లా ఉండాలి అని చెప్పారు. ఇప్పుడు రకుల్ కూడా ఇదే చేస్తుంది. మొన్నటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న రకుల్.. ఇప్పుడు కేరాఫ్ బాలీవుడ్ అయిపోయింది. అక్కడ వరస సినిమాలు చేస్తూ బిజీ అయిపోతుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం అయ్యారీ ప్రమోషన్స్ తో బిజీగా గడిపేస్తుంది రకుల్. ఎవర్ని ఎప్పుడు ఎక్కడ ఎలా పడగొడితే ఏంటి లాభం అనే సంగతి రకుల్ కి బాగా తెలుసు. తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వరసగా చిన్న హీరోలతో నటించింది రకుల్. అప్పుడు తన అందాల గదికి తాళం వేసుకుంది. ఎప్పుడైతే స్టార్ హీరోలతో నటించే అవకాశం వచ్చిందో.. అప్పుడే అందాల గదికి తాళం తీసింది. బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ లాంటి సినిమాల్లో బాగానే గ్లామర్ షో చేసింది రకుల్ ప్రీత్.
ముంబై భామ కదా.. స్టార్స్ ను చూసే సరికి గ్లామర్ లెక్కలన్నీ సరిచేయాలని చూస్తుంది. ఇప్పుడు బాలీవుడ్ లోనూ ఇదే దారిలో వెళ్తుంది రకుల్. అక్కడ వరసగా ఆఫర్లు వస్తుండటంతో అక్కడే సెటిల్ అయిపోవాలని చూస్తుంది రకుల్. దాంతో ఇన్నాళ్లూ దాచేసిన అందాల నిధిని స్టార్స్ కోసం బయట పెట్టేసింది. ఇప్పుడు బయట ఎక్కడైనా ఫంక్షన్ లు జరిగినా కూడా అదిరిపోయే గ్లామర్ షో చేస్తుంది రకుల్. దీనికి అయ్యారీ ప్రమోషన్సే నిదర్శనం. బాలీవుడ్ లో అందాలు ఆరబోయకపోతే పట్టించుకోరు. అందుకే అక్కడికి వచ్చినపుడే ఫిక్స్ అయింది రకుల్.. తనపైనే కెమెరాలన్నీ ఫోకస్ చేయాలని. అనుకున్నట్లుగానే అదే చేసింది. థైస్ కనిపించేలా చిన్న చిన్న డ్రస్సులతో మతులు పోగొట్టేసింది రకుల్. ఈ ముద్దుగుమ్మ అందాలతో మాత్రం అక్కడి వేడుక మొత్తం హీట్ ఎక్కిపోయింది. మొత్తానికి స్టార్ ఇమేజ్ వచ్చినా.. అది తెచ్చిన గ్లామర్ షో ను మాత్రం వదల్లేదు ఈ ముద్దుగుమ్మ.