అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్న ఫిగర్ అది.. ఇప్పటికి ప్రభాస్ కాకుండా చిరంజీవి మాత్రమే సాధించాడు ఆ రికార్డ్. అదే 100 కోట్ల షేర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. బాహుబలి కాకుండా ఖైదీ నెం.150 మాత్రమే అది అందుకుంది. ఇప్పుడు రంగస్థలంకు మళ్లీ ఆ అవకాశం వచ్చింది.
ఇప్పటికే 9 రోజుల్లోనే 85 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. తొలిరోజు నుంచి ట్రేడ్ కు షాకుల మీద షాకులిస్తూ కలెక్షన్ల సునామీ సృష్టించింది రంగస్థలం. పదేళ్లుగా పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, ఎన్టీఆర్ లాంటి సూపర్ స్టార్లు చేయలేని.. పదేళ్ళ తర్వాత వచ్చి చేసి చూపించాడు చిరంజీవి.
ఇప్పుడు ఇదే రికార్డుల వేడుక తనయుడు చేసి చూపిస్తున్నాడు. ఇప్పటికీ రంగస్థలం వసూళ్లు స్ట్రాంగ్ గా ఉన్నాయి. తొమ్మిదో రోజు కూడా 3 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది రంగస్థలం. ఇక రెండో వారంలోనూ ఈ చిత్ర దూకుడు కనిపిస్తుంది. అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ అదిరిపోతున్నాయి. ఈ దూకుడు చూస్తుంటే 100 కోట్లు అందుకోడానికి ఎంతో టైమ్ పట్టేలా లేదు. ఎలాగూ మరో వారం వరకు పెద్ద సినిమాలేవీ లేవు.
ఎప్రిల్ 12న నాని కృష్ణార్జున యుద్ధం వచ్చేవరకు రంగస్థలందే దూకుడు. మూడో వీకెండ్ లోనూ సినిమా మంచి వసూళ్లు రాబట్టేలా కనిపిస్తుంది. మొత్తానికి చూడాలిక.. ఈ రచ్చ చూస్తుంటే రంగస్థలం ఎంతవరకు వెళ్తుందో ఊహించడం కూడా కష్టంగా మారిందిప్పుడు.