ఓ వైపు 110 కోట్లు దాటేసిందంటూ తమ సినిమాను ప్రమోట్ చేసుకుంటుంటే.. ఇప్పుడు 25 కోట్లు ఏంటి అనుకుంటున్నారా..? ఒక్కో రోజు వెళ్తుంటే సిట్టిబాబు ఒక్కో రికార్డును తన ఖాతాలో వేసుకుంటున్నాడు. సినిమా వచ్చి నాలుగు వారాలు అయినా కూడా ఇప్పటికీ రంగస్థలం హవా కనిపి స్తుంది బాక్సాఫీస్ దగ్గర
. భరత్ అనే నేను లాంటి పెద్ద సినిమా పోటీలో ఉన్నా కూడా ఇప్పటికీ తన ఉనికి చాటుకుంటుంది. అందుకే నాలుగో వారం తర్వాత కూడా 25 స్క్రీన్ లు మళ్లీ అదనంగా ఇచ్చారు ఈ చిత్రానికి. నాలుగో వారంలోనూ దాదాపు 4 కోట్ల షేర్ వసూలు చేసింది రంగస్థలం. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు సినిమా రచ్చ ఇప్పటికీ ఎలా ఉందనేది.
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 84 కోట్ల షేర్ అందుకుంది రంగస్థలం. ఇక నైజాంలో ఐతే ఏకంగా 25 కోట్ల మార్క్ అందుకుంది. ఒక్క బాహుబలి తప్ప తెలంగాణలో 25 కోట్ల షేర్ అందుకున్న హీరో మరొకరు లేరు. ఇప్పుడు రామ్ చరణ్ ఇది చేసి చూపించాడు. నైజాంలో ఇప్పటికే మగధీరతో 22 కోట్ల మార్క్ అందుకున్న చరణ్..
ఇప్పుడు రంగస్థలంతో దాన్ని మించిపోయాడు. 25 రోజులకు గానూ ఈ చిత్రం 112 కోట్ల షేర్ వసూలు చేసింది. మొత్తానికి ఫుల్ రన్ అయ్యేసరికి సిట్టి బాబు ఇంకెన్ని రికార్డులు సెట్ చేస్తాడో..?